Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాత్‌రూమ్‌ సింగర్‌ నుంచి స్టూడియో సింగర్‌గా... యాంకర్ సుమ

''నేను అందరిలాగానే బాత్‌రూమ్‌లో పాటలు పాడతాను. కానీ స్టూడియో సింగర్‌గా అవుతానని అస్సలు అనుకోలేదు. నా వృత్తి యాంకరింగ్‌. ఇకముందు గాయనిగా కొనసాగాలని అనుకోవడంలేదని'' ప్రముఖ యాంకర్‌ సుమ తెలియజేశారు. సాయిధరమ్‌ తేజ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ నటించిన 'విన్నర్‌

Advertiesment
anchor suma comments
, గురువారం, 16 ఫిబ్రవరి 2017 (22:00 IST)
''నేను అందరిలాగానే బాత్‌రూమ్‌లో పాటలు పాడతాను. కానీ స్టూడియో సింగర్‌గా అవుతానని అస్సలు అనుకోలేదు. నా వృత్తి యాంకరింగ్‌. ఇకముందు గాయనిగా కొనసాగాలని అనుకోవడంలేదని'' ప్రముఖ యాంకర్‌ సుమ తెలియజేశారు. సాయిధరమ్‌ తేజ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ నటించిన 'విన్నర్‌'లో ఆమె అనసూయ కోసం ఓ పాట పాడింది. ఆ పాట సోషల్‌ మీడియాలోనూ బయట శ్రోతలను అలరిస్తోంది. ఈ సందర్భంగా సుమ, అనసూయలు తమ మనోగతాలను వివరించారు.
 
అనసూయపై పాట పాడటం నాకే ఆశ్చర్యంగా వుంది. చాలాసార్లు పాటను విని.. నేనే పాడానా! లేదా! అనే అనుమానం కూడా కల్గింది. తమన్‌ ఓ రోజు ఫోన్‌ చేసి పాట పాడాలి అన్నారు. జోక్‌ చేస్తున్నారేమో అనిపించింది. లేదు.. నిజమే చెబుతున్నానంటూ మరుసటి రోజు చెన్నై వచ్చేయమన్నారు. ఈ విషయం విన్న రాజీవ్‌ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తదుపరి రోజు చెన్నైలోని స్టూడియోకు వెళ్ళగానే చరణం చూపించారు. 'సూయ సూయ అనసూయ..' అనే పాట అది. ఇదేంటి అనసూయమీద పాటలా వుందే అన్నాను. 
 
అవును.. దీన్ని రామజోగయ్యశాస్త్రి రాశారు. దీన్నే మీరు పాడాలి అన్నారు. ఈ పాట పాడిన తర్వాత రోజు అనిరుధ్‌ విడుదల చేశారు. ఈ పాట విన్న చోటా కె.నాయడు ప్రశసించడం.. ఆదిత్య మ్యూజిక్‌ వారు బాగుందని మెచ్చుకోవడం కొత్తగా అనిపించింది.
 
సింగర్స్‌ ప్రతిస్పందన
నేను వీణ నేర్చుకున్నాను. ఆడియో ఫంక్షన్‌లో అప్పుడప్పుడు గొంతు సవరణ చేసుకుంటాను. అలా నా వాయిస్‌లో బేస్‌ వచ్చేసింది. నా గొంతులోని ఎనర్జీ తమన్‌ గారికి నచ్చి పిలిపించారని చెప్పారు. నేను బాత్‌‌రూమ్‌ సింగర్‌నే. అందరి అమ్మాయిల్లా పాడేదాన్ని. కానీ స్టూడియో సింగర్‌గా మారతానని అనుకోలేదు. టీవీ షో 'అంత్యాక్షరి'లో కూనిరాగాలు చేశాను.
 
'సూపర్‌ సింగర్‌'కు యాంకరింగ్‌ చేశాను. ఇప్పుడు గాయనిగా మారాను. అయితే బాలుగారితో కలిపి సింగర్స్‌ గ్రూప్‌లో నేనూ వున్నాను. 'స్వరాభిషేకం' నుంచి ఆ గ్రూప్‌లో వున్నాను. అందులో యాంకర్‌గా నేనే మిగిలాను. విన్నర్‌ సినిమాతో గాయనిగా మారాను. ఈ పాటను  బాలు గారికి పంపించాను. తమన్‌, కంప్యూటర్‌ సాయంతో పాడాను.. అని మెసేజ్‌ చేశాను. 
 
వెంటనే.. ఆయన. చాలా బాగుంది.. ఇట్‌ ఈజ్‌ నైస్‌.. అని మెసేజ్‌ పెట్టారు. ఇంకొందరు చిన్న స్మైల్‌తో పాడాల్సింది అని కూడా సూచించారు. ఏదిఏమైనా తొలిసారిగా ఆదిత్య ఆడియోలో సుమ కనకాల పేరు రావడం థ్రిల్‌ కల్గించింది. యాంకరింగే నా వృత్తి. పాటల్లోకి వెళ్ళాలనుకోలేదు. ఇప్పుడున్న సింగర్స్‌ చాలా ప్రతిభగలవారు. ఏదైనా ఏడాదికి ఒకసారి వస్తే పాడతాను. బాలుగారికి నా యాంకరింగ్‌ ఇష్టం. నా నుంచి పాట ఆశించరు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆడది ఐటమా! అనసూయ ప్రశ్న