Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యాంకర్ లోబోకు యాక్సిడెంట్.. ఎలా జరిగింది..?

పాపులర్ టీవీ ఛానల్ యాంకర్ మహ్మద్ కయూమ్ అలియాస్ లోబోకు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వరంగల్‌-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదానికి అతివేగమే కారణమని సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. ఆట

Advertiesment
యాంకర్ లోబోకు యాక్సిడెంట్.. ఎలా జరిగింది..?
, బుధవారం, 23 మే 2018 (15:25 IST)
పాపులర్ టీవీ ఛానల్ యాంకర్ మహ్మద్ కయూమ్ అలియాస్ లోబోకు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వరంగల్‌-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదానికి అతివేగమే కారణమని సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. ఆటోను కారు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఏడుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. 
 
ఓ టీవి చానెల్ యాంకర్ అయిన ఖయ్యూం అలియాస్ లోబో అతి వేగంగా కారు నడపడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని ప్రమాదానికి గురైన బాధితులు కూడా తెలిపారు. కానీ ఆ రోడ్డు మార్గం వన్ వే కావడంతో కారుకు ఎదురుగా ఆటో వచ్చిందని.. దీంతో కారు ఒక్కసారిగా ఎదురుగా వచ్చిన ఆటోను ఢీకొట్టిందని స్థానికులు అంటున్నారు. 
 
టీవీ యాంకర్ లోబో, ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ వంశీప్రియ, ఫోటోగ్రాఫర్‌తో కలిసి హనుమకొండ నుంచి హైదరాబాద్‌కి కారులో బయల్దేరాడు. మార్గమధ్యలో నిడిగొండ వద్ద జనగామ నుంచి రఘునాథ్ పల్లి వైపు ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను లోబో కారు ఢీకొట్టింది. 
 
అయితే రెండు వాహనాలు అతివేగంగా ఢీకొనడంతో ఆటోలో ప్రయాణించిన ఆరుగురికి తీవ్రగాయాలైనాయి. ప్రమాద సమయంలో లోబో ప్రయాణిస్తున్న కారు బెలూన్లు తెరుచుకోవడంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. 

వెనుక సీట్లో కూర్చున్న మరో ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కాగా, ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఆటో ప్రయాణికుడు మేడె కుమార్(25) జనగామ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.

ఈ ప్రమాదంలో ఎవరి తప్పు అనేది తాను చెప్పలేనని.. దేవుడి దయతో ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డామని లోబో తెలిపారు. రోడ్డు సరిగ్గా లేకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని లోబో చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మధురవాణిగా సమంత.. మేకింగ్ వీడియోను ఓ లుక్కేయండి