Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పేదింటి రాజుకు 'దొరసాని'గా వెళుతున్న జీవిత కుమార్తె శివాత్మిక

Advertiesment
పేదింటి రాజుకు 'దొరసాని'గా వెళుతున్న జీవిత కుమార్తె శివాత్మిక
, గురువారం, 30 మే 2019 (21:20 IST)
సీనియర్ నటి జీవితా రాజశేఖర్ కుమార్తె శివాత్మిక "దొరసాని"గా మారిపోయింది. ఓ గొప్పింటి వ్యక్తికి దొరసానిగా కారులో వెళుతోంది. దీనికి సంబంధించిన ఫస్ట్ అదిరిపోయింది. టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయం చేస్తూ ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్ నిర్మిస్తున్న చిత్రం దొరసాని. ఈ చిత్రానికి కె.వి.మహేంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. 
 
ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ గురువారం విడుదల చేసింది. కారులో కూర్చున్న దొరసానిని ఆ పక్కనే సైకిల్‌పై వెంబడిస్తూ హీరో ఆరాధనగా ఆమెను చూస్తున్నట్లు ఉన్న ఈ లుక్ సినిమా కథను చెప్పకనే చెబుతోంది. 
 
1980 దశకంలో ఉన్న బానిస బతుకులు, పేద ధనిక తేడాల మధ్య ఓ పేదింటి రాజుకి, గొప్పింటి దొరసానికి మధ్య ఏర్పడిన ప్రేమ కథే ఈ 'దొరసాని' చిత్ర కథగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని బిగ్ బెన్ మూవీస్ కూడా సహ నిర్మాణ సంస్థగా వ్యవహరిస్తోంది. ఈ చిత్రం జూలై 5వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అసిస్టెంట్ డైరెక్టర్ అవతారమెత్తిన అనుపమ పరమేశ్వరన్..