Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

న్యూఢిల్లీ లో రామ్ చరణ్‌ కు అమిత్ షా సన్మానం

amith sha sanmam to charan
, శుక్రవారం, 17 మార్చి 2023 (22:40 IST)
amith sha sanmam to charan
కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా ఈ రోజు సాయంత్రం న్యూఢిల్లీలోని ఇండియా టుడే కాన్క్లేవ్ వేదికగా రామ్ చరణ్‌ను కలుసుకున్నారు. విజయవంతమైన ఆస్కార్ ను  ఇంటికి తీసుకు వచ్చినందుకు RRR మొత్తం బృందం తరపున అతన్ని అభినందించారు. ఆశీర్వదించారు. ఇండియా ప్రొడక్షన్‌కి మొట్టమొదటి ఆస్కార్. తన చిరస్మరణీయమైన అమెరికా పర్యటన నుండి తిరిగి వచ్చిన రామ్ చరణ్‌ను కలవడానికి ఢిల్లీకి వెళ్లిన మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సందర్భంగా హాజరై కొడుకును  చూసి చాలా థ్రిల్ అయ్యారు. అమిత్ షా ఆప్యాయతకు చిరు చెప్పలేని ఆనందాన్ని  పొందారు. 
 
webdunia
amith sha sanmam to charan
ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో పాల్గొనడానికి రామ్ చరణ్ లాస్ ఏంజెల్స్ నుండి  ఈ ఉదయం నేరుగా న్యూఢిల్లీకి వెళ్లి భారతీయ సినిమా సాధించిన గౌరవం పట్ల తన ఉత్సాహాన్ని పంచుకున్న సంగతి తెలిసిందే. ఇది SS రాజమౌళి  అసమానమైన దార్శనికతతో నడిచే RRR టీమ్ మొత్తం సాధించిన ఘనత అని, కీరవాణి మరియు చంద్రబోస్‌ల ప్రకాశం మరియు ఆస్కార్ దేశానికి మరియు భారతదేశ ప్రజలకు చెందుతుందని ఆయన అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్ టి.ఆర్. రాకతో జోష్ లో ఉన్న విశ్వక్ సేన్