`అమ్మాయిలు అణిగిమణిగి వుండాలంటారు. కానీ నా దృష్టిలో వారు కూడా తగ్గేదేలే.లా అనుకుని వుండాలి. నా జీవితంలో తగ్గేదేలే.. అనేదానికి చాలా ప్రాధాన్యత వుంది. ఈ డైలాగ్ కేవలం సినిమాపరంగా పెట్టలేదు. నా పర్సనల్‌గా నేను చెప్పుకునే మాట అది. మీలాగే (అభిమానులు) నాకూ భయపడే క్షణాలుంటాయి. ధైర్యం చేసి ముందడుగు వేయి. పడిపోయినా పర్లేదు. తగ్గేదే లే.. అని అనుకుని ఇంతదూరం వచ్చాను. అమ్మాయిలూ మీరు అలానే వుండండి` అని అల్లు అర్జున్ అభిమానులకు, మహిళలకు ధైర్యాన్ని నింపారు.
రెండు ప్రత్యేకతలు నాకు
పుష్ప టీజర్‌లో ఆయన మాట్లాడారు. రేపు అనగా ఏప్రిల్ 8న బన్నీ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ పుట్టినరోజు ప్రత్యేకం. మొదటిది పుష్ప టీజర్, రెండోది నా లైఫ్ టేకాఫ్ అయింది ఆర్య సినిమాతోనే. సుకుమార్‌తోనే. ఆ సినిమా తర్వాత స్టయిలిష్ స్టార్ అనే పేరు వచ్చింది. ఇప్పుడు ఐకాన్ అని సుకుమార్ టైటిల్ ఇచ్చారు. ఆయన నాకు ఏమి ఇచ్చినా స్పెషల్‌గా వుంటుంది అని చెప్పారు.
తమిళ, కన్నడ, మలయాలం. హిందీ భాషలవారు తెలుగు సినిమాలు చూస్తున్నందుకు రగ్వంగా వుంది. తెలుగు సినిమా బాహుబలితో ఎంతో ఎదిగిపోయింది. పాన్ ఇండియా స్థాయికి చేరింది. పుఫ్సకూడా ఆ స్థాయి సినిమానే. రాబోయే 25 ఏల్ళలో పప్రంచస్థాయిలో తెలుగు సినిమా మరింత ఎదుగుతుంది అన్నారు.