Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సంధ్య థియేటర్‌ నుంచి బయటికి అల్లు అర్జున్‌.. సీసీ టీవీ దృశ్యాలు వైరల్‌ (video)

Advertiesment
Allu Arjun

సెల్వి

, ఆదివారం, 22 డిశెంబరు 2024 (18:39 IST)
Allu Arjun
పుష్ప-2 రిలీజ్ తర్వాత అల్లు అర్జున్‌కు పాపులారిటీ బాగా పెరిగిపోతుందనుకుంటే.. అది జరగలేదు. ప్రస్తుతం అల్లు అర్జున్‌పై నిందలు ఆరోపణలు, విమర్శలు ఎక్కువైపోయాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద వున్న సంధ్య థియేటర్‌లో పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా తొక్కిసలాట జరిగింది. 
 
ఈ ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుమారుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ వ్యవహారంలో అల్లు అర్జున్ అరెస్టయి.. బెయిల్‌పై విడుదల అయ్యాడు. ఇక ఈ విషయంపై తెలంగాణ అసెంబ్లీలోనూ రచ్చ రచ్చ జరిగింది. 
 
ఈ తొక్కిసలాటకు అల్లు అర్జునే కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే థియేటర్ వద్ద ఆ సంఘటన జరిగిన సమయంలో సినిమా హాల్ నుంచి అల్లు అర్జున్‌ను బయటకు తీసుకురావడానికి పోలీసులు ప్రయత్నించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అల్లు అర్జున్ సినిమాల్లో మాదిరి నిజ జీవితంలో నటిస్తున్నట్లు కనిపిస్తోంది.. చామల