Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కొత్త దర్శకులను ప్రోత్సహించేందుకే వీ4 బ్యానెర్ : అల్లు అరవింద్

కొత్త ఆలోచనలతో వచ్చే యువ దర్శకులను ప్రోత్సహించేందుకే వీ4 బ్యానర్‌ను స్థాపించినట్టు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ వెల్లడించారు. ఈ బ్యానర్‌లో ఆది సాయికుమార్, వైభవి, రష్మీ గౌతమ్ జంటగా 'నెక్స్ట్ నువ్వే' అన

Advertiesment
కొత్త దర్శకులను ప్రోత్సహించేందుకే వీ4 బ్యానెర్ : అల్లు అరవింద్
, మంగళవారం, 19 సెప్టెంబరు 2017 (15:48 IST)
కొత్త ఆలోచనలతో వచ్చే యువ దర్శకులను ప్రోత్సహించేందుకే వీ4 బ్యానర్‌ను స్థాపించినట్టు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ వెల్లడించారు. ఈ బ్యానర్‌లో ఆది సాయికుమార్, వైభవి, రష్మీ గౌతమ్ జంటగా 'నెక్స్ట్ నువ్వే' అనే చిత్రాన్ని నిర్మించారు. ఇది ఈ బ్యానర్‌లో ఇదే మొదటి చిత్రం. 
 
ఈ కొత్త బ్యానర్ గురించి నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ, యువ దర్శకులను ప్రోత్సహించడమే ఈ బ్యానర్ ఉద్దేశమన్నారు. కొత్తగా ఆలోచించేవారికి ఆహ్వానం పలుకుతుందని చెప్పారు. కొత్త దర్శకులతో కొత్త ఆలోచనలను పంచుకుంటూ నిర్మాతగా వాళ్లతో కలిసి ప్రయాణించడానికే ఈ బ్యానర్‌ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. యువ దర్శకులు కొత్త ఆలోచనలతో ముందుకువస్తే, వారిని ప్రోత్సహించడం కోసం ఈ బ్యానర్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. 
 
కాగా, టాలీవుడ్‌లోని అగ్ర నిర్మాతల్లో అల్లు అరవింద్ ఒకరు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై ఆయన ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. ఇటీవలే గీతా ఆర్ట్స్ 2 అనే బ్యానర్‌ను కూడా ఏర్పాటు చేసి వరుస సినిమాలు చేస్తూ వెళుతున్నారు. ఈ నేపథ్యంలోనే బన్నీ వాసు .. జ్ఞానవేల్ రాజా.. యూవీ క్రియేషన్స్‌తో కలిసి 'వి4 క్రియేషన్స్' అనే పేరుతో మరో బ్యానర్ ను ఏర్పాటు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

న్యూయార్క్‌లో నయన-విఘ్నేశ్.. ఏం చేస్తున్నారో తెలుసా? ఫోటో చూడండి