బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 ముగిసింది. అలాగే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన టాప్-5 కంటెస్టెంట్లు, కంటెస్టెంట్ల పేరెంట్స్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ బిగ్ బాస్ షో గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 4లో విన్నర్‌ను ప్రకటించే సమయంలో హోస్ట్ నాగార్జున అఖిల్ చేతిని ఒక్కసారిగా విదిలించారు. నాగార్జున అలా చేయడంతో అఖిల్ ఫ్యాన్స్ కూడా ఫీలవుతున్నారు.
నాగార్జున అలా చేయడం గురించి అఖిల్ తల్లి సరోజా మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్ షోలో పాల్గొనాలని అఖిల్ కోరుకున్నాడని సీజన్-4లో అఖిల్ రన్నర్ అయినందుకు ఎంతో ఆనందంగా ఉందని ఆమె అన్నారు. బిగ్ బాస్ హౌస్‌లో రెండో పొజిషన్ వరకు ఉంటాడని అఖిల్ తనకు చెప్పాడని ఆ మాటను నిలబెట్టుకున్నాడని ఆమె అన్నారు.
బిగ్ బాస్ రన్నర్ అయినా ప్రేక్షకుల్లో ఫాలోయింగ్‌ను సంపాదించుకోవడంతో పాటు అభిమానుల హృదయాలను అఖిల్ గెలుచుకున్నాడని ఆమె చెప్పారు. అయితే బిగ్ బాస్ టైటిల్ విన్నర్‌ను ప్రకటించే సమయంలో నాగార్జున ఒక్కసారిగా చేతిని విదిలించడం తనకు బాధ కలిగించిందన్నారు. సోహెల్ గేమ్‌ను గేమ్‌లా చూశాడని అతను 25 లక్షల రూపాయలు తీసుకొని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రావడంలో తనకు తప్పేం అనిపించలేదని ఆమె తెలిపారు.