యంగ్ హీరో నిఖిల్‌కు కార్తికేయ సీక్వెల్ ఎంతో కలిసి వచ్చింది. కార్తికేయ ఘనవిజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. సీక్వెల్‌గా కార్తికేయ2 చేశాడు. ఊహించనివిధంగా పాన్ ఇండియా హీరోగా నిఖిల్ ఎదిగిపోయాడు. ఆ సినిమా విమర్శకులను సైతం మంత్రముగ్థుల్ని చేసింది. అన్ని భాషల్లోనూ విజయాన్ని సాధించి తెలుగు సినిమాను ఊపిరిని మరింత పెంచింది.
తాజాగా నిఖిల్ తదుపరి చిత్రం 18 పేజెస్ కోసం చివరి షెడ్యూల్ షూట్‌లో చేరాడు. దీపావళి సందర్భంగా టీమ్‌తో సందడి చేశారు. నిఖిల్ షూట్‌కు రాగానే చిత్ర యూనిట్ అంతా సందడి నెలకొంది. ఈ సందర్భంగా నిఖిల్ వారితో ఇలా ఫొటోకే స్టిల్ ఇచ్చి ఆనందాన్ని వ్యక్తం చేసుకున్నారు. ఈ సినిమాకు జీనియస్ దర్శకుడు సుక్కు కథ అందించారు. డిసెంబర్ 23న థియేట్రికల్ రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ కొత్త అప్‌డేట్‌ను వెల్లడించింది.
2021లో ప్రారంభమైన 18 పేజెస్. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ల పై బన్నీ వాసు, సుకుమార్ నిర్మించిన ఈ సినిమాకు పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించాడు. నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.