Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ సంఘమిత్రకూ మన అనుష్క, తమన్నాయే దిక్కు.. దీపికా పడుకునేకీ చాన్సుందట

క్రీ.శ 8వ శతాబ్దానికి చెందిన చారిత్రక వ్యక్తి సంఘమిత్ర ప్రధాన పాత్రధారిగా తమిళ చిత్ర పరిశ్రమ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సంఘమిత్ర సినిమాకు ఆదిలోనే హంసపాదు పడింది. సినిమా ప్రారంభం కాక ముందే యుద్ధ విద్యల్లో శిక్షణ పొందటానికి లండన్ వెళ్లిన సంఘమిత్ర పాత్ర

Advertiesment
ఆ సంఘమిత్రకూ మన అనుష్క, తమన్నాయే దిక్కు.. దీపికా పడుకునేకీ చాన్సుందట
హైదరాబాద్ , శుక్రవారం, 2 జూన్ 2017 (09:19 IST)
క్రీ.శ 8వ శతాబ్దానికి చెందిన చారిత్రక వ్యక్తి సంఘమిత్ర ప్రధాన పాత్రధారిగా తమిళ చిత్ర పరిశ్రమ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సంఘమిత్ర సినిమాకు ఆదిలోనే హంసపాదు పడింది. సినిమా ప్రారంభం కాక ముందే యుద్ధ విద్యల్లో శిక్షణ పొందటానికి లండన్ వెళ్లిన సంఘమిత్ర పాత్రధారి శ్రుతిహసన్ ఉన్నట్లుండి తనదైన కారణాలతో ఈ ప్రాజెక్టునుంచే తప్పుకోవడంతో చిత్ర నిర్మాణ సంస్థకు, దర్శకుడు సి. సుందర్‌కు గుండెల్లో రాయి పడినట్లయింది. శ్రుతిహసన్ ప్రాజెక్టు నుంచి తప్పుకుందని చెప్పడం సులభమే కానీ ఉన్నట్లుండి ఇంకో హీరోయిన్ ఎక్కడ దొరకుతారు అన్నదే ప్రధాన సమస్య అయి కూర్చుంది. పైగా సినిమా షెడ్యూల్ దగ్గర పడుతున్నందున మరో హీరోయిన్‌ను లండన్ పంపించి మార్షల్‌ ఆర్ట్స్‌లో ట్రైనింగ్‌ ఇప్పించేంత టైమ్‌ ‘సంఘమిత్ర’ టీమ్‌ దగ్గర లేదు. 
 
ఒకవేళ అంత రిస్క్‌ తీసుకునే గట్స్‌ ఉన్నా... ఇప్పటికిప్పుడు మార్షల్‌ ఆర్ట్స్‌ ట్రైనింగ్‌కి, షూటింగ్‌కి బోలెడంత టైమ్‌ కేటాయించే స్టార్‌ హీరోయిన్లు ఎవరున్నారు అందుకే ఆల్రెడీ కత్తి యుద్ధాలు, గుర్రపు స్వారీ, మార్షల్‌ ఆర్ట్స్‌లో ట్రైనింగ్‌ తీసుకున్న హీరోయిన్‌ అయితే బాగుంటుందని ‘సంఘమిత్ర’ టీమ్‌ ఆలోచనగా తెలుస్తోంది.
 
సంఘమిత్ర చిత్ర నిర్మాత, దర్శకుడు సోంబేరులని ఆరోపిస్తూ శ్రుతీహాసన్‌ సినిమా నుంచి తప్పుకోవడంతో ‘సంఘమిత్ర’ దర్శకుడు సుందర్‌ .సి, చిత్రనిర్మాణ సంస్థ తేనాండాళ్‌ స్టూడియోస్‌ కొత్త హీరోయిన్‌ వేటలో పడ్డారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా తీయనున్నారు కనుక... మూడు భాషల ప్రేక్షకులకు తెలిసిన హీరోయిన్‌ గురించి అన్వేషిస్తున్నారని టాక్‌. 
 
ఈ అన్వేషణలో వాళ్లకు ముగ్గురు హీరోయిన్లు మెయిన్‌గా కనిపిస్తున్నారట. వాళ్లే... అనుష్క, తమన్నా, హిందీ హీరోయిన్‌ దీపికా పదుకొనె. రాణీ సంఘమిత్ర పాత్రకు ఈ ముగ్గురూ కరెక్ట్‌గా సూటవుతారని యూనిట్‌  భావిస్తోందట! వాళ్లతో సంప్రదింపులు కూడా షురూ చేశారని సమాచారం. సో, ముగ్గురిలో రాణీ సంఘమిత్ర ఎవరు అనేది త్వరలో తెలుస్తుంది. 
 
అయితే బాహుబలి 2లో సౌందర్యం, సౌశీల్యం, రాజసం మూర్తీభవించిన కుంతల దేశ యువరాణి దేవసేనగా అత్యున్నత నటన కనబర్చి యావద్భారత ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన అనుష్క కంటే సంఘమిత్రకు సరైనా పాత్రధారిణి ఎవరుంటారు? సంఘమిత్ర నిర్మాత, దర్శకులకు ఏమాత్రం వివేకం ఉంటే వెనకూ ముందూ ఆలోచించకుండా అనుష్కకే సంఘమిత్ర చాన్స్ ఇస్తారు. ఇవ్వాలి కూడా. ఎందుకుంటే ఆమె తప్ప యువరాణి, రాణి పాత్రలకు గానూ భారత చిత్రపరిశ్రమలోనే మరొకరిని ఊహించుకోలేం. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డైలాగ్, సాంగ్, ఫైట్, రొమాన్స్ ఏదీ లేదు.. టీజర్ ఇలా కూడా తీస్తారా.. ప్రభంజనం సృష్టిస్తున్న స్పైడర్ టీజర్