Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'మన్మథుడు'తో నటించడం ప్రాక్టికల్స్ చేసినట్టే : హీరోయిన్ శీరత్ కపూర్

టాలీవుడ్ మన్మథుడు నాగార్జున నటించిన తాజా హారర్ థ్రిల్లర్‌ చిత్రం 'రాజుగారి గది 2'. ఈ చిత్రం కోసం నాగ్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 13వ తేదీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertiesment
'మన్మథుడు'తో నటించడం ప్రాక్టికల్స్ చేసినట్టే : హీరోయిన్ శీరత్ కపూర్
, బుధవారం, 11 అక్టోబరు 2017 (07:37 IST)
టాలీవుడ్ మన్మథుడు నాగార్జున నటించిన తాజా హారర్ థ్రిల్లర్‌ చిత్రం 'రాజుగారి గది 2'. ఈ చిత్రం కోసం నాగ్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 13వ తేదీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 
ఇందులో నాగార్జునతో పాటు.. ఆయన కోడలు సమంతలు ప్రధానమైన పాత్రలు పోషించగా, హీరోయిన్ శీరత్ కపూర్ ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రంలో తన పాత్ర, నాగార్జునతో కలిసి నటించడంపై శీరత్ స్పందిస్తూ, ఇందులో తన పాత్ర చాలా సరదాగా ఉంటుందనీ, అందరినీ ఆకట్టుకుంటుందని చెప్పుకొచ్చింది. 
 
ముఖ్యంగా తన పాత్రలో ఎన్నో కోణాలు ఉంటాయనీ.. ఈ పాత్రను చేయడం అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పింది. ముఖ్యంగా, నాగార్జున వంటి అగ్రహీరో పక్కన నటించడం ప్రాక్టికల్స్ చేసినట్టేనని చెప్పింది. నాగ్ సలహాలు .. సూచనల వలన ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నట్టు తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అందులో లక్ష్మీపార్వతి విషయాలన్నీ వుంటాయ్... వర్మ(వీడియో)