Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బిగ్ బాస్ కంటే జైలు బెటర్ అంటున్న నటి కస్తూరి

Actress Kasturi

డీవీ

, శనివారం, 21 డిశెంబరు 2024 (11:35 IST)
Actress Kasturi
సరిగ్గా నెల క్రితం నటి కస్తూరి రిమాండ్ ఖైదీగా కిందజైలుకు వెళ్ళింది. తమిళనాడులో స్థిరపడ్డ తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆమెకు జైలు జీవితం దక్కింది. ఆ తర్వాత జైలు నుంచి బయటకు వచ్చాక తన అనుభవాలను కొన్ని మీడియా ఛానల్స్ తో తెలియజేసింది. మనం ఎలా పుట్టామో అలానే నిలబెడతారు. కూర్చొపెడతారు. చెవి, నోరు, ముక్కు, అన్ని అవయవాలను కూడా చెక్ చేసి లోపల ఏమైనా దాచిపెట్టి వుంటామోనని చెక్ చేస్తారు. ఒక రెండు దుప్పట్లు, చెంబు, పల్లెం ఇస్తారు. అంటూ పలు విషయాలు చెప్పింది.
 
కాగా, బిగ్ బాస్ లో కూడా పాల్గొన్న ఆమె రెండింటినీ కంపేర్ చేస్తూ, జైలు ఈజ్ బెటర్ దాన్ బిగ్ బాస్ అంటూ వెల్లడించింది. బిగ్ బాస్ రూమ్ లో వంట చేయడానికి తినడానికి వుంది. ఊరికే కంటెంట్ ఇవ్వడానికి గొడవలు వుంటాయి. బిగ్ బాస్ అనేది ఇమ్మెచ్యూర్ గా వుంటుంది. చాలా మందికి నచ్చదు. అక్కడ అన్నీ మేనేజ్ చేయాలి. అంతా కల్పితం. లోపల పెన్, బుక్ కూడా వుండదు. నేను హనుమాన్ చాలీసా బుక్ కూడా అడిగి తీసుకెళ్ళాను. తెలుగు బిగ్ బాస్ లో ఎక్సర్ సైజ్ చేయడానికి జిమ్ కూడా వుంటుంది. కానీ తమిళనాడు అది కూడా వుండదు. ఎందుకంటే జిమ్ వుంటే మైండ్ ఫర్ ఫెక్ట్ గా వుంటుందని తీసేశారు. ఓసారి బిగ్ బాస్ రూమ్ హోస్ట్ కమల్ హాసన్ నన్ను పిలిచి, మీరు బయట మాట్లాడినట్లు బోల్డ్ గా మాట్లాడలేదే? అంటూ అడిగారు. అంటే పిచ్చిపిచ్చిగా మాట్లాడాలి అన్నమాట. ఇక మరోవైపు బిగ్ బాస్ రూమ్ ఎ.సి. రూమ్. ఆ ఎ.సి. కూడా ఎక్కువగా వుంటుంది. చాలా చలిగా వుంటుంది. అందుకే బయటకు వచ్చి నిద్రపోయేదాన్ని.
 
జైలు అయితే ఫుడ్ క్యూరెటెడ్, ప్రొటీన్, నాన్ వేజ్, కార్పొహైట్రెడ్ ఫుడ్ ఇస్తారు. రిమాండ్ ప్రిజన్ కూడా అదే ట్రీట్ మెంట్. లైబ్రరీ, స్కూల్ వుంది. జైలులో స్కూల్ వరకు చదవవచ్చు. ఇదంతా అక్కడే ఎక్కువకాలం వుండేవారికి చెందుతుంది. జైలు అనేది పాజిటివ్ ఎక్స్ పీరియన్స్. నేను ఒంటరిగా వున్నా మేనేజ్ చేసుకోగలను అనే ధైర్యం వచ్చింది.  జైలులో నేను పరిశీలించింది ఏమంటే, శిక్షపడినవారంతా దోషులు కాదు. దోషులందరికీ శిక్ష పడలేదు. చాలామంది బయట తిరుగుతున్నారు. అయితే చాలా అనుభవం నేర్పింది. అందుకే నన్ను శిక్షమీద జైలులో వేసినవారికి చాలా థ్యాంక్స్ చెబుతున్నాను. ఎందుకంటే జైలులో వున్నప్పుడే చాలా విషయాలు తెలుసుకున్నాను. మనో ధైర్యం కలిగించేలా జైలు తోడ్పడింది అని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆది సాయికుమార్ హారర్ థ్రిల్లర్ శంబాల