జీవిత రాజశేఖర్ సోదరుడి అరెస్టు .. రూ.7 కోట్ల పాత కరెన్సీ స్వాధీనం
పాత నోట్ల మార్పిడి కేసులో సినీ నటి జీవిత రాజశేఖర్ సోదరుడు శ్రీనివాస్‌ను హైదరాబాద్ నగర పోలీసులు అరెస్టు చేశారు. శ్రీనివాస్‌తో పాటు రవి అనే మరో వ్యక్తిని కూడా హైదరాబాద్ సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఫోలీస
పాత నోట్ల మార్పిడి కేసులో సినీ నటి జీవిత రాజశేఖర్ సోదరుడు శ్రీనివాస్‌ను హైదరాబాద్ నగర పోలీసులు అరెస్టు చేశారు. శ్రీనివాస్‌తో పాటు రవి అనే మరో వ్యక్తిని కూడా హైదరాబాద్ సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఫోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.7 కోట్ల విలువైన పాత కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ పాత కరెన్సీ నోట్లను మార్చేందుకు ప్రయత్నించే సమయంలో శ్రీనివాస్, రవిలను పట్టుకున్నారు. నటి జీవితకు చెందిన శ్రీనివాస్ ఎంటర్ప్రైజెస్ అనే భవనంలో వీరితో పాటు.. పాత నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. కాగా, శ్రీనివాస్ గతంలో డ్రగ్స్ కేసులో అరెస్టు అయి విడుదలయ్యాడు. ప్రస్తుతం నకిలీ నోట్ల మార్పిడి కేసులో అరెస్టు చేయగా, ఇపుడు ఈ నకిలీ నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయన్న కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.