Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మ‌ధ్య‌త‌ర‌గ‌తి మ‌హిళ పాత్ర‌లో న‌టి గౌత‌మి

ఎన్నో విలక్షణమైన పాత్రలతో, కథాంశాలతో మెప్పించిన జాతీయస్థాయి ఉత్తమనటుడు మోహన్ లాల్ ప్ర‌ధాన పాత్ర‌లో వారాహి చిలనచిత్రం బ్యానర్లో రూపొందుతోన్న చిత్రం `మనమంతా`. ఈ చిత్రంలో విలక్షణ నటి గౌతమి కూడా ఈ చిత్రంలో మరో ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రంలో న‌టి

Advertiesment
Actress Gautami
, శనివారం, 9 జులై 2016 (19:42 IST)
ఎన్నో విలక్షణమైన పాత్రలతో, కథాంశాలతో మెప్పించిన జాతీయస్థాయి ఉత్తమనటుడు మోహన్ లాల్ ప్ర‌ధాన పాత్ర‌లో వారాహి చిలనచిత్రం బ్యానర్లో రూపొందుతోన్న చిత్రం `మనమంతా`. ఈ చిత్రంలో  విలక్షణ నటి గౌతమి కూడా ఈ చిత్రంలో మరో ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రంలో న‌టి గౌత‌మి గాయ‌త్రి అనే సాధార‌ణ మ‌ధ్య త‌ర‌గ‌తికి చెందిన గృహిణి పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఇల్లు త‌ప్ప వేరే ప్ర‌పంచం తెలియ‌దు. బాగా చ‌దువుకున్న వ్య‌క్తి, తెలివైన వ్య‌క్తి అయినా పెళ్ళి చేసుకుని కుటుంబ‌మే లోకంగా బ్ర‌తికేస్తుంటుంది.
 
మ‌ధ్యత‌ర‌గ‌తి వ్య‌క్తుల ఆలోచ‌నా ధోర‌ణితో న‌డుచుకునే మ‌హిళ‌గా గౌత‌మి పాత్ర ఆమె కెరీర్‌లో వ‌న్ ఆఫ్ ది బెస్ట్ అవుతుంద‌ని చిత్ర‌యూనిట్ భావిస్తుంది. మ‌ధ్య‌త‌ర‌గ‌తి గృహిణి పాత్ర‌లో ఆమె న‌ట‌న‌, మ‌రో విల‌క్ష‌ణ న‌టి ఊర్వ‌శి గారితో క‌లిసి ఆమె పండించిన వినోదం ప్రేక్ష‌కుల‌కు ఎంత‌గానో న‌చ్చుతుంది. ‘One world four stories’…నాలుగు కథలు ఒకటే ప్రపంచం అనే కాన్సెప్ట్‌తో ఈ నాలుగు కథలు ఎలాంటి మలుపులు తీసుకుని ఏ ముగింపు చేరుకుందనేదే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని చంద్ర‌శేఖ‌ర్ యేలేటి ద‌ర్శక‌త్వంలో వారాహి సాయి కొర్రపాటి ప్రొడక్షన్ సాయిశివాని సమర్పణలో వారాహి చలన చిత్రం బ్యానర్ పైన రజనీ కొర్రపాటి నిర్మాతగా ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం నిర్మాణాంతర కార్య‌క్రమాల‌ను జ‌రుపుకుంటుంది. త్వ‌ర‌లోనే విడుద‌ల‌కు స‌న్నాహాలు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెరికాలో పోస్ట్‌ప్రొడక్షన్ జరుపుకుంటున్న ‘చిత్రాంగద’