Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శరత్ కుమార్, రాధిక దంపతులకు ఏడాది జైలుశిక్ష.. ఎందుకో తెలుసా?

Advertiesment
శరత్ కుమార్, రాధిక దంపతులకు ఏడాది జైలుశిక్ష.. ఎందుకో తెలుసా?
, బుధవారం, 7 ఏప్రియల్ 2021 (16:42 IST)
Radhika Sarathkumar
కోలీవుడ్ స్టార్ కపుల్ రాధిక శరత్ కుమార్ దంపతులకు ఓ కేసు విషయంలో స్పెషల్ కోర్ట్ ఓ యేడాది జైలు శిక్ష విధించింది. 2019లో మద్రాస్ హైకోర్టు ఈ స్టార్ జంటపై పెండింగ్‌లో ఉన్న రెండు చెక్ బౌన్స్ కేసులను కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేస్తే కోర్టు ఈ పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో ఈ జంటకు యేడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. 
 
2014లో శరత్ కుమార్ ఆయన భార్య రాధిక కలిసి విక్రమ్ ప్రభు దర్శకత్వంలో ఓ చిత్రలో నటించారు. దీని ఓ ప్రెమిసెస్ మీడియా ఫైనాన్స్ అనే సంస్థ నుండి అప్పు తీసుకున్నారు. సదరు సంస్థతకు ఓ యేడాది తర్వాత తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చారు. తీరా సినిమా విడుదలైన తర్వాత ఆ డబ్బును ఆ ఫైనాన్స్ సంస్థకు తిరిగి చెల్లించలేదు. సదరు ఫైనాన్స్ వాళ్లకు కట్టాల్సిన డబ్బులతో మరో ప్రాజెక్ట్ కూడా చేశారు. 
 
తీరా ఫైనాన్స్ వాళ్లు శరత్ కుమార్ దంపతులపై ఒత్తడి చేయగా.. చివరకు రూ.50లక్షలను రూ. 10 లక్షల చెప్పున ఐదు చెక్‌లను అందజేసారు. తీరా ఆ చెక్‌ను మార్చుకుందామని బ్యాంక్‌కు వెళితే.. అది కాస్తా బౌన్స్ అయింది. దీంతో సదరు ఫైనాన్స్ సంస్థ ఈ విషయమై కోర్టు ఎక్కింది. దీంతో కోర్టు పలు మార్లు ఈ కేసు విచారించి శరత్‌కుమార్‌ దంపతులుకు యేడాది జైలు శిక్ష విధించింది. మరోవైపు ఈ కేసు విషయమై శరత్ కుమార్ దంపతులు పై కోర్టుకు వెళ్లేందుకు అనుమతించింది.
 
శరత్ కుమార్ విషయానికొస్తే.. ఈయన విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హీరోగా పలు పాత్రలను పోషించి నటుడిగా తనదైన వైవిధ్యాన్ని ప్రదర్శించారు శరత్‌కుమార్. అలాగే 2006లో తలైమగన్ అనే సినిమాను డైరెక్ట్ కూడా చేయడం విశేషం. ప్రస్తుతం ఈయన నటుడిగానే కొనసాగుతున్నారు.
 
ప్రస్తుతం ఈయన మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న పొన్నియన్ సెల్వన్‌లో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లోనూ అడుగు పెట్టిన శరత్‌కుమార్ పొలిటికల్‌గా సక్సెస్ సాధించలేదు. మరోవైపు రాధిక కూడా తెలుగులో ఒకప్పుడు నెంబర్ వన్ హీరోయిన్‌గా సత్తా చాటింది. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీగా మారింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇప్పుడు తృప్తి. ఎల్లుండి నుంచి ఎంజాయ్‌మెంట్ః దిల్ రాజు‌