Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మనశ్శాంతి లేకుండా ఉన్నా... రజినీకాంత్ మాట గుర్తొచ్చింది... సప్తగిరి వ్యాఖ్య

హాస్యనటుడు సప్తగిరి.. ఎక్స్‌ప్రెస్‌లా.. దూసుకుపోతున్నాడు. హీరోగా మారిపోయాడు. సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌తో సినిమా తీశాడు. ఆడియో వేడుకకు పవన్‌ కళ్యాణ్‌ కూడా వచ్చి ఆశీర్వదించాడు. ఇందుకు కృతజ్ఞతలు తెలియజేశాడు. అంతేకాకుండా ఎంతోమందికి పని కల్పించి.. నిర్మాత కష

Advertiesment
Actor Saptagiri Comments on cine website
, మంగళవారం, 27 డిశెంబరు 2016 (15:03 IST)
హాస్యనటుడు సప్తగిరి.. ఎక్స్‌ప్రెస్‌లా.. దూసుకుపోతున్నాడు. హీరోగా మారిపోయాడు. సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌తో సినిమా తీశాడు. ఆడియో వేడుకకు పవన్‌ కళ్యాణ్‌ కూడా వచ్చి ఆశీర్వదించాడు. ఇందుకు కృతజ్ఞతలు తెలియజేశాడు. అంతేకాకుండా ఎంతోమందికి పని కల్పించి.. నిర్మాత కష్టపడి సంపాదించిన డబ్బును వెచ్చించి సినిమా తీశాడు. ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. 
 
కానీ ఒకే ఒక్కడు నెగెటివ్‌గా వ్యక్తిగతంగా రాసేశాడు. ఓ వెబ్‌సైట్‌లో సినిమా గురించి రాయకుండా కేవలం వ్యక్తిగతంగా.. ఇతను హీరోగా పనికిరాడంటూ ఏదోదో రాసేసి మనస్సు గాయపర్చాడు. నా ఎదుగుదలను వయస్సు పైబడిన అమ్మానాన్నలు చూసి ఆనందిస్తున్నారు. కానీ ఆ ఒక్కడు రాసినదానివల్ల చాలా బాధపడ్డాను. ఇది అహంవల్ల చెప్పడంలేదు. ఆయన ఎందుకు అలా రాశాడో తెలీదు.. కానీ ఆయన రాయడంవల్ల ఇంట్లో మనశ్సాంతి లేకుండా వున్నాను. 
 
ఏదిఏమైనా మనస్సు దిటవు చేసుకుని.. రజనీకాంత్‌ ఓ సినిమాలో చెప్పిన డైలాగ్‌ నేను ఎప్పుడూ గుర్తు పెట్టుకుని వుంటాను.. ''తప్పులు చేస్తే శిక్షలు పైన పడతాయనేది పాతకాలం మాట. ప్రస్తుత కాలంలో తప్పుచేస్తే ఇక్కడే శిక్ష పడుతుంది''.. ఇది నేను ఆ వ్యక్తికి చెప్పేమాట. ఏదైనా వుంటే సినిమా పరంగా రాయండి.. నా ఫ్యామిలీ జోలికి రాకండి.. అంటూ బాధను వ్యక్తం చేశాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్క్రిప్టు నచ్చితే ఎలాగైనా నటిస్తా.. పరిమితులంటూ ఉండవు : సన్నీ లియోన్