బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ఆస్పత్రిలో చేరారు. ఆయనకు శ్వాస పీల్చడంలో ఇబ్బందులు ఏర్పడటంతో హుటాహుటిన ముంబైలోని లీలావతి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అయితే, ఆయనకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, నెగిటివ్ ఫలితం వచ్చినట్టు సమాచారం. అయినా సరే కొన్ని రోజుల పాటు వైద్యుల పరిశీలనలో ఉండాలని ఆయన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని చెబుతున్నారు.
సంజయ్ దత్ ఆరోగ్య విషయమై లీలావతి హాస్పటల్ వైద్యులు కూడా స్పందించారు. భయపడాల్సింది ఏమీ లేదని తెలిపారు. ప్రస్తుతం శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారని, ఆయనకి కోవిడ్ లక్షణాలు అయితే లేవని తెలపడంతో పాటు, నాన్ కోవిడ్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు.