Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహానటుడు ఎన్టీఆర్ స్థాపించిన పార్టీలో సినీ నటులకు గుర్తింపు లేదు : నటి కవిత

తెలుగుదేశం పార్టీపై ఆ పార్టీ మహిళా నేత, సినీ నటి కవిత మండిపడ్డారు. ఎన్నికలకు ముందు తమకు వందల సార్లు ఫోన్లు చేసి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని పదేపదే కోరేవారన్నారు.

Advertiesment
మహానటుడు ఎన్టీఆర్ స్థాపించిన పార్టీలో సినీ నటులకు గుర్తింపు లేదు : నటి కవిత
, మంగళవారం, 12 జులై 2016 (08:57 IST)
తెలుగుదేశం పార్టీపై ఆ పార్టీ మహిళా నేత, సినీ నటి కవిత మండిపడ్డారు. ఎన్నికలకు ముందు తమకు వందల సార్లు ఫోన్లు చేసి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని పదేపదే కోరేవారన్నారు. కానీ, అధికారంలోకి వచ్చాక.. తమను పట్టించుకోవడమే మానేశారనీ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. విపక్షంలో ఉన్నపుడు ఒకలా.. అధికారంలోకి వచ్చాక మరోలా ప్రవర్తించడం టీడీపీ నేతలకు పరిపాటిగా మారిందని ఆమె విమర్శించారు. 
 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ఆమె పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... మహానటుడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో సినీ నటులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత ప్రతి పక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలోకి వచ్చాక మరోలా వ్యవహరిస్తున్నారన్నారు.
 
ఎన్నికలప్పుడు ప్రచారం కోసం, పదేళ్లుగా ప్రతి పక్షంలో ఉన్నప్పుడు ఎక్కడ ధర్నా జరిగినా వందసార్లు ఫోన్లు చేసేవారని ఇపుడు ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చాక పిలవడమే మానుకున్నారన్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవ చేసిన తమను పూర్తిగా పట్టించుకోవడం లేదన్నారు.  ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన 'నీరు-చెట్టు' కార్యక్రమానికి ఎవరినీ పిలవలేదని తెలిపారు. 
 
తెలంగాణా రాష్ట్రంలో చేపట్టిన హరితహారం కార్యక్రమానికి సినీనటులు హాజరుకావాలని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌యాదవ్ స్వయంగా కోరారనీ, హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ అధికారులు ఫోన్లు చేసి మరీ పిలిచారన్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరికీ ప్రాధాన్యత ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జ‌న‌నేత క‌నిపిస్తే, రాజ‌కీయాల‌కు రెడీ.. హీరో సుమ‌న్