Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మళ్ళీ పెళ్లి నుంచి కావేరి గాలిలా పాట

Advertiesment
naresh-pavitra
, బుధవారం, 17 మే 2023 (19:07 IST)
naresh-pavitra
మళ్లీ పెళ్లి మే 26న విడుదల కానుంది. డా. నరేష్ వి.కె గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్ 'మళ్ళీ పెళ్లి' హ్యూజ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది. యూనిక్ కథతో తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ లో పవిత్ర లోకేష్ కథానాయిక.  మెగా మేకర్ ఎంఎస్ రాజు రచన  దర్శకత్వం వహిస్తున్నారు.  విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌పై నరేష్ స్వయంగా దీనిని నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.
 
ఫస్ట్ లుక్,  గ్లింప్స్, టీజర్, పాటలు  ఇలా ప్రతి ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి  కావేరి గాలిలా పాటని విడుదల చేశారు. సురేష్ బొబ్బిలి ఈ పాటని మనసుని హత్తుకునే మెలోడియస్ ట్యూన్ గా  కంపోజ్ చేశారు. నరేష్ అయ్యర్ ఆలపించిన ఈ పాటకు అనంత శ్రీరామ్ అందించిన సాహిత్యం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ పాటలో నరేష్, పవిత్ర లోకేష్ ల కెమిస్ట్రీ బ్యూటీఫుల్ గా వుంది.  
 
సురేష్ బొబ్బిలి, అరుల్‌దేవ్ కలిసి ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఎంఎన్ బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ, జునైద్ సిద్ధిక్ ఎడిటర్. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా, భాస్కర్ ముదావత్ ప్రొడక్షన్ డిజైనర్.
 
జయసుధ, శరత్‌బాబు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో వనిత విజయకుమార్, అనన్య నాగళ్ల, రోషన్, రవివర్మ, అన్నపూర్ణ, భద్రం, యుక్త, ప్రవీణ్ యండమూరి, మధు తదితరులు నటిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమితాబ్ -అనుష్కలకు లిప్టిచ్చిన బైకర్లకు అపరాధం