Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

Lucky Baskhar: లక్కీభాస్కర్ స్ఫూర్తి.. హాస్టల్ నుంచి నలుగురు విద్యార్థుల ఎస్కేప్

Lucky Bhaskar look

సెల్వి

, మంగళవారం, 10 డిశెంబరు 2024 (22:15 IST)
లక్కీభాస్కర్ సినిమాలో హీరో లాగా ఇల్లు, కార్లు సంపాదించి తిరిగొస్తామని ఫ్రెండ్స్‌కు చెప్పి నలుగురు విద్యార్థులు హాస్టల్ వదిలి వెళ్లిపోయారు. విశాఖలో ఈ విస్మయం కలిగించే ఘటన చోటుచేసుకుంది. ఆ నలుగురు విద్యార్థులు విశాఖలోని మహారాణిపేటలో ఓ హాస్టల్ నుంచి పరారయ్యారు. పరారైన విద్యార్థులను కిరణ్ కుమార్, కార్తీక్, చరణ్ తేజ, రఘు అని గుర్తించారు. వీరు సెయింట్స్ ఆన్స్ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్నారు. 
 
కాగా, విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. లక్కీ భాస్కర్ సినిమాలో పేదరికం నుండి బయటపడి అక్రమ మార్గాల ద్వారా కోటీశ్వరుడు అయిన చిత్ర కథానాయకుడి నుండి ఈ విద్యార్థులు ప్రేరణ పొందినట్లు సమాచారం. 
 
సినిమా హీరోలా కార్లు, ఇళ్లు కొనుక్కోవడం ద్వారా తాము కూడా ఈజీ మనీ మార్గాన్ని అనుసరించగలమని విద్యార్థులు విశ్వసించారు. దీంతో పథకం వేసిన విద్యార్థులు హాస్టల్ గేటు దూకి అదృశ్యమయ్యారు. ఈ ఘటన అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డవ్వడంతో వారు పారిపోతున్నట్లు తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Mohan Babu-Manoj: ఏంట్రా మీకు చెప్పేది, మీడియాపై మోహన్ బాబు దాడి (video)