నివేద థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్ లో నటించిన న్యూ ఏజ్ క్లీన్ ఎంటర్‌టైనర్."35-చిన్న కథ కాదు'. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నంద కిషోర్ ఈమాని రైటర్ డైరెక్టర్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది."35-చిన్న కథ కాదు"సెప్టెంబర్ 6న తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత సృజన్ యరబోలు విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.
మీరు మూవీస్ లోకి ఎలా వచ్చారు ?
-ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్ ని. ఓవర్సిస్ లో దాదాపు 70 సినిమాలని డిస్ట్రిబ్యూషన్ చేశాను. 2015లో స్టార్ట్ చేశాను. మొదటి సినిమా కంచె. అక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటూ వచ్చాను. 'మను' సినిమాతో నిర్మాతగా మారాను. ఆ సినిమా సెప్టెంబర్ 6నే విడుడలైయింది. నా టెన్త్ ఫిలిం '35-చిన్న కథ కాదు' కూడా సెప్టెంబర్ 6నే విడుదల కావడం ఆనందంగా వుంది. ఇప్పటివరకూ నేను చేసినవన్నీ కంటెంట్ బేస్డ్ ఫిలిమ్స్.
-కాన్సెప్ట్ తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ వుండే కథలు చేస్తూ ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాను. ఓ నాలుగు వందల కథలు విని అందులో ఓ ఐదు కథలు సెలెక్ట్ చేసుకున్నాను. ఆ ఐదు కూడా పూర్తి సంతృప్తిని ఇవ్వలేదు. ఏదైనా చేస్తే జనాలకు గుర్తుండిపోవాలి. క్లాసిక్ గా నిలిచిపోవాలి. మహానటి, జర్నీ, సీతారామం లాంటి కథ కోసం వెదుకుతున్న సమయంలో నాకు వచ్చిన కథ '35-చిన్న కథ కాదు'.
'35-చిన్న కథ కాదు'లో కమర్షియల్ ఎలిమెంట్ ఏమిటి ?
-మదర్ సెంటిమెంట్ కి మించిన కమర్షియల్ ఎలిమెంట్ ఏది లేదు. ఇందులో అది అద్భుతంగా కుదిరింది. కథ, స్క్రీన్ ప్లే పెర్ఫెక్ట్ గా వుంటాయి. ఓ పెద్ద హీరో ఈ సినిమా చూసి వయసుతో నిమిత్తం లేకుండా అందరినీ థియేటర్ కి పంపించే కథ అని కాంప్లిమెంట్ ఇచ్చారు. అది నేను నమ్ముతున్నాను. సినిమా విడుదల తర్వాత టాక్ స్ప్రెడ్ అవుతుంది. వైల్డ్ ఫైర్ లా సినిమా అంతాట వ్యాపిస్తుంది. సినిమాని అందరూ వోన్ చేసుకుంటారు. ఇది థియేటర్ కోసం చేసిన సినిమా. తిరుపతి, అక్కడ ఓ ఇల్లు, స్కూల్ ఇలా ఓ బ్యూటీఫుల్ వరల్డ్ వుంటుంది. సినిమా చూస్తున్నపుడు ఆడియన్స్ కి ఆ వరల్డ్ లో వున్న ఫీలింగ్ కలుగుతుంది.
-దర్శకుడు నందు ఈ కథని చెప్పినపుడే నేను వెదుకుతున్న కథ దొరికేసిందనే ఫీలింగ్ కలిగింది. కథ విన్నప్పుడు ఎంత ఆనందంతో వున్నాను.. ఈ రోజుకి అదే ఆనందంతో వున్నాను.
నాగార్జున గారు ట్రైలర్ లాంచ్ చేశారు కదా.. ఆయన రియాక్షన్ ఏమిటి ?
-నాగార్జున గారు ట్రైలర్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా వుంది. ఆయనకి టీజర్, ట్రైలర్ చాలా నచ్చాయి. బిగ్ బాస్ వలన సినిమా మరింత రీచ్ వెళ్ళింది. నాగార్జున గారి వీలుని బట్టి ఫిల్మ్ చూపిస్తాం.
-ఇండస్ట్రీలో కొందరు ఫిల్మ్ చూశారు. సినిమా గురించి చాలా గొప్పగా చెబుతున్నారు. మేము ఇంత గొప్ప రెస్పాన్స్ ఊహించలేదు. సినిమా విడుదల తర్వాత ఆడియన్స్ నుంచి కూడా ఇంతే అద్భుతమైన రెస్పాన్స్ వస్తుందనే నమ్మకం వుంది. ఈ సినిమాకి చాలా మంచి రేటింగ్స్ వస్తాయి.
ట్రైలర్ చూస్తే స్కూల్ లైఫ్, నోస్టాల్జియా మూమెంట్స్ వున్నాయి ? మీ రియల్ లైఫ్ కి రిలేట్ అయ్యారా?
-నేను మా అమ్మగారితో చాలా రిలేట్ అయ్యాను. నివేతని చూస్తే మా అమ్మనే గుర్తుకు వస్తుంది. సినిమాలో చాలా రిలేషన్షిప్స్, లేయర్స్ వుంటాయి. సినిమా చూస్తున్నపుడు ప్రతి ఒక్కరూ దేనికో ఒక ఎలిమెంట్ కి కనెక్ట్ అవుతారు. మన కథ అనిపించే సినిమా ఇది. చాలా రోజుల తర్వాత పిల్లల కోసం ఫ్యామలీ అంత కలిసి థియేటర్ కి వెళ్లి పండగలా సెలబ్రేట్ చేసుకునే సినిమా ఇది.
చాలా ఎక్కువమంది పిల్లలని కాస్ట్ చేశారని తెలుస్తుంది ?
-ఈ విషయంలో రానాకి థాంక్స్ చెప్పాలి. నందు రానా దగ్గర వున్నపుడు ఆడియన్స్ జరిగాయి. 1500 మంది వచ్చారు. అందులో 60 మందిని ట్రైన్ చేశాం. ఇదంతా తిరుపతిలో జరిగింది. పిల్లల పేరెంట్స్ తో కలిపి దాదాపు మూడు వందల మంది ప్రతిరోజు సెట్ లో వుండేవాళ్ళు. నిజానికి ఒక పెద్ద సినిమాకి ఇంతమంది వుంటారు. కమర్షియల్ యాంగిల్ లో కాకుండా సినిమాని నమ్మి మనస్పూర్తిగా చేశాం. దీనంతటికీ చాలా ప్లానింగ్ వుండాలి. మేము అనుకున్న బడ్జెట్ లో పూర్తి చేసినందుకు హ్యాపీగా వుంది.
ఈ సినిమాకి తిరుపతి బ్యాక్ డ్రాప్ ఎందుకు ?
-ఈ కథకు డివోషినల్ డెస్టినేషన్ కావాలి. తిరుపతి ఇందులో ఒక క్యారెక్టర్. అది సినిమా చూసినప్పుడు తెలుస్తుంది. తిరుపతి తిరుమల నేపధ్యంలో చాలా డైలాగ్స్ వస్తాయి. సినిమా చూసినప్పుడు డివైన్ ఫీలింగ్ వుంటుంది. యూనివర్సల్ గా అందరికీ కనెక్ట్ అవుతుంది.
హీరోగా విశ్వదేవ్ ని తీసుకోవడానికి కారణం ?
-ఇది హీరో సెంట్రిక్ ఫిల్మ్ కాదు. క్యారెక్టర్ బేస్డ్ ఫిలిం. జనాలు థియేటర్స్ కి వచ్చేటప్పుడు హీరో విషయంలో కొన్ని అంచనాలు వుంటాయి. స్క్రీన్ టైం లేదని, మరొకటి డిస్కషన్ పాయింట్ ఉండకూడదు. కథ, స్క్రీన్ ప్లే అనేది డిస్కషన్ పాయింట్ కావాలి. ఇందుకోసం కొత్త హీరోగా వెళ్లాలని అనుకున్నాం. విశ్వ కూడా ఆడిషన్స్ ద్వారా వచ్చారు. ఈ సినిమాతో విశ్వ ప్రేక్షకులకు గుర్తుండిపోతారు.
నివేద రోల్ గురించి ?
-నివేద చాలా ఎఫెర్ట్ పెట్టింది. సినిమా చూసిన తర్వాత ఆమెనే ఈ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ అని ఆడియన్స్ ఫీలౌతారు. తిరుపతి డైలెక్ట్ ని చాలా కష్టపడి నేర్చుకొని సింక్ సౌండ్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. ఇందులో క్లాప్స్ పడే మూమెంట్స్ చాలా వుంటాయి.
దర్శి క్యారెక్టర్ గురించి ?
-దర్శికి ఈ కథ తెలుసు. ఈ సినిమాలో ఆయన పార్ట్ కావాలని అనుకున్నారు. ఇందులో ఆయన క్యారెక్టర్ గుర్తుండిపోతుంది. అలాగే గౌతమీ గారితో పాటు అన్నీ పాత్రలు ఆకట్టుకుంటాయి.
-ఈ సినిమా మ్యాజికల్ జర్నీ. డీవోపీ నికేత్, మ్యూజిక్ వివేక్ సాగర్ అందరూ ఒక టీం వర్క్ గా చేశారు. డైరెక్టర్ అద్భుతంగా హ్యాండిల్ చేశారు.
రిలీజ్ ప్లాన్స్ గురించి ?
-సెప్టెంబర్ 6న బెస్ట్ డేట్. వినాయక చవితి, టీచర్స్ కలిసోస్తున్నాయి. ఇవి మా సినిమాకి ప్రోపర్ గా వుంటాయి. యుఎస్ లో రెండు రోజులకి ముందే రిలీజ్ చేస్తున్నాం. కంటెంట్ మీద చాలా నమ్మకంగా వున్నాం. ఎవరూ చూసిన చాలా బావుందని చెబుతున్నారు. వోన్ చేసుకొని అందరికీ చెబుతున్నారు. యూఎస్ ఆడియన్స్ ఇచ్చే రివ్యూస్ ఇక్కడికి స్ప్రెడ్ అవుతుందని నమ్ముతున్నాం.
-ఈ సినిమాకి నాన్ థియేట్రికల్ గా బెస్ట్ డీల్స్ వచ్చాయి. ఈ విషయంలో చాలా ఆనందంగా వుంది.
ఈ సినిమా గురించి ఆడియన్స్ కి ఏం చెప్తారు ?
-కన్నడలో కాంతార, మలయాళంలో మంజుమ్మల్ బాయ్స్, తమిళ్ లో మహారాజ, తెలుగులో ."35-చిన్న కథ కాదు'. ఇది పదేళ్ళు నిలిచిపోయే సినిమా అవుతుంది. బాపు గారు, విశ్వనాథ్ గారి సినిమాలని గుర్తుచేస్తుంది. ఈ సినిమా నా కెరీర్ లో మైల్ స్టోన్ మూవీ అవుతుందనే నమ్మకం వుంది.
నెక్స్ట్ చేస్తున్న సినిమాలు ?
-తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బాతో చేస్తున్న సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. గతంకు సీక్వెల్ జరుగుతోంది. అలాగే ఒక థ్రిల్లర్ ని త్వరలోనే ఎనౌన్స్ చేస్తాం.