Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

30 రోజుల్లో ప్రేమించడం ఎలా, సరికొత్త రికార్డ్..

Advertiesment
30 rojullo preminchadam ela
, గురువారం, 5 మార్చి 2020 (20:29 IST)
యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా పరిచయమవుతున్న చిత్రం 30 రోజుల్లో ప్రేమించటం ఎలా?. ఈ చిత్రానికి మున్నా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రదీప్ మాచిరాజు, అమృతా అయ్యర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్వీ ప్రొడక్షన్స్ బ్యానర్ పైన ఎస్వీ బాబు నిర్మిస్తున్నారు. విభిన్న ప్రేమకథా చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్స్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఈ సినిమాపై ఆడియన్స్‌లో ఆసక్తి ఏర్పడింది. 
 
ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా నీలి నీలి ఆకాశం పాట రిలీజ్ కావడం తెలిసిందే. ఈ పాట ఇలా రిలీజ్ అయ్యిందో లేదో అలా.. యుట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేసింది.
 
ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సినిమాని చూసిన సెన్సార్ బోర్డ్ మెంబర్స్ ఒక దృశ్యకావ్యంగా ఉందని అభినందించినట్లు చిత్ర బృందం తెలియచేసంది. నీలి నీలి ఆకాశం పాట సంగీత ప్రపంచంలో ఒక సంచలనం సృష్టిస్తూ యూట్యూబ్‌లో ఇప్పటికి 50 మిలియన్ వ్యూస్ సాధించడం విశేషం. 
 
ఒక చిన్న సినిమాలో పాట ఈ స్థాయిలో పాపులర్ కావడం ఈమధ్య కాలంలో ఇదే. సంగీత ప్రియులు ఈ పాటను ఈ స్థాయిలో ఆదరిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది ఓ రికార్డ్ అని చెప్పచ్చు. నిర్మాత ఎస్వీ బాబు తెలిపారు. 
 
ఈ చిత్రంలో హీరో ప్రదీప్ రెండు షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో కొత్తగా కనిపిస్తారని... ఆ పాత్రలో ఆయన నటన ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. హీరోహీరోయిన్ల మధ్య సన్నివేశాలు ఎమోషనల్‌గా ఉండి అలరిస్తాయి అని నిర్మాత చెప్పారు. 
 
అనూప్ రూబెన్స్ సంగీతం, చంద్రబోస్ సాహిత్యం, దాశరథి శివేంద్ర ఛాయాగ్రహణం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ అవుతాయి. దర్శకునికి ఇది తొలి సినిమా అయినప్పటికీ ఒక దృశ్య కావ్యంలా చిత్రాన్ని రూపొందించారు. లవ్ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ సినిమా అందర్నీ అలరిస్తుంది. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం అని నిర్మాత ఎస్వీ బాబు చెప్పారు. 
 
అయితే... ప్రదీక్‌కి బుల్లితెరపై ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ ప్రదీప్‌ని ఇష్టపడతారు. 
 
ఇప్పుడు ప్రదీప్ బుల్లితెర నుంచి వెండితెరకు హీరోగా వస్తున్నాడని తెలియడంతో ఈ సినిమా పై క్యూరియాసిటీ ఏర్పడింది. దీనికి తగ్గట్టుగా నీలి నీలి ఆకాశం.. సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేయడంతో ఈ సినిమా గురించి ఎంతగా ఎదురు చూస్తున్నారో తెలుస్తుంది. సెన్సార్ బోర్డ్ మెంబర్స్ ఈ చిత్ర యూనిట్ అభినందించడంతో టీమ్ అందరూ సినిమా ఖచ్చితంగా సక్సస్ సాధిస్తుందని చెబుతున్నారు. ఇప్పటి వరకు సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్‌తో ఆకట్టుకున్న ప్రదీప్ మాచిరాజు ఇప్పుడు హీరోగా ఎంతవరకు ఆకట్టుకుంటాడో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నన్ను బాగా తొందరపెడుతున్నారంటున్న కేథరిన్