Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గర్ల్స్ అండ్ బీర్ : అతడికి గర్ల్‌ఫ్రెండ్స్‌దే లోకం...

Advertiesment
క్రికెట్ గాళ్స్
న్యూ కాన్సెప్ట్‌తో న్యూ జనరేషన్‌కు నచ్చే శైలిలో రూపొందుతోన్న చిత్రం క్రికెట్ - గర్ల్స్ అండ్ బీర్. సాజిటేరియన్ ఫిలిమ్స్ పతాకంపై ఎస్. ఉమేష్ కుమార్ దర్శకత్వంలో ఎస్. సునీత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆదర్శ్, సూర్యతేజ్, నాగశౌర్య ఇందులో కథానాయకులు.

దర్శకుడు మాట్లాడుతూ.. రెండు దశాబ్దాలుగా అమెరికాలో స్థిరపడ్డాను. ఫిలిమ్ మేకింగ్ అంటే మొదట్నుంచీ ప్రాణం. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ సినిమాల తీరుతెన్నుల్ని బాగా విశ్లేషించి అన్ని వర్గాలకూ నచ్చే విధంగా ఈ కథ తయారు చేశాను. ఇది ముగ్గురు సోదరుల చుట్టూ తిరిగే కథ. ఒకతనికి క్రికెట్ అంటే ప్రాణం. ఇంకొకతనికి గాళ్ ఫ్రెండ్స్ లోకం.

మరొకతనికి బీర్ లేకపోతే రోజు గడవదు. ముగ్గురివి మూడు రకాల దారులు. ఓ అనుకోని సంఘటన వీరి జీవితాల్లో ఊహించని మార్పులు తీసుకు వస్తుంది. అదే ఈ సినిమాకు మెయిన్ హైలెట్. అమెరికాలో స్థిరపడిన దాస్, శ్యామ్ వైను సంగీత దర్శకులుగా పరిచయం చేస్తున్నాం. ఆరు పాటలూ కొత్త టోన్‌తో అలరిస్తాయి. శరత్ ఛాయాగ్రహణం ఆకట్టుకునే విధంగా ఉంటుందని చెప్పారు.

సారిక అప్హన్, వినోద్ కుమార్, ఎమ్మెస్ నారాయణ, శివారెడ్డి, సూర్య, రాజా శ్రీధర్, రజిత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శరత్, సంగీతం: దాస్. శ్యామ్, పాటలు: సతీష్ బానాల, మాటలు: రవి కిరణ్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, ఆర్ట్ నారాయణ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: విమల్

Share this Story:

Follow Webdunia telugu