Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బోరున విలపించిన నటి శ్రియ... ఏడిపించిన ఆ రిచ్ మ్యాన్ ఎవరు?

ఇష్టం చిత్రంతో తెలుగు వెండితెరపై కనిపించిన హీరోయిన్ శ్రియ. ఆ తర్వాత అగ్రహీరోలందరితోనూ నటించిన నెంబర్ వన్ హీరోయిన్‌గా ఎదిగింది. తర్వాత బాలీవుడ్‌లో కూడా ఈ అమ్మడు అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఎప్పుడూ హాట

Advertiesment
బోరున విలపించిన నటి శ్రియ... ఏడిపించిన ఆ రిచ్ మ్యాన్ ఎవరు?
, సోమవారం, 19 డిశెంబరు 2016 (11:48 IST)
ఇష్టం చిత్రంతో తెలుగు వెండితెరపై కనిపించిన హీరోయిన్ శ్రియ. ఆ తర్వాత అగ్రహీరోలందరితోనూ నటించిన నెంబర్ వన్ హీరోయిన్‌గా ఎదిగింది. తర్వాత బాలీవుడ్‌లో కూడా ఈ అమ్మడు అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఎప్పుడూ హాట్ లుక్స్‌తో కనిపించే శ్రియా ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంది. 
 
అయితే, ఆ మధ్య అవకాశాలు లేక ఇంటికే పరిమితమైంది. దీంతో పలు చిత్రాల్లో ఐటమ్ సాంగ్‌లలో నటించి కూదా. కానీ, శ్రియ నటనకు మెచ్చి... యువరత్న బాలకృష్ణ, క్రిష్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. 
 
అలాంటి శ్రియ బోరున విలపించిన సందర్భాలు పలు ఉన్నాయట. ఈ విషయాన్ని ఆమె ఓ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. తనను ఓ రిచ్ పర్సన్ ఘోరంగా ఏడ్పించాడని ఆ సమయంలో నేను ఎంతగా ఏడ్చానో ఆ దేవుడికే తెలుసని వ్యాఖ్యానించింది.
 
నాకు ఎంతో సెంటిమెంట్‌గా భావించే క్లచ్‌ని డ్యామేజ్ చేశాడు ఓ సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తి పైగా అది డ్యామేజ్ కావడంతో బాధపడుతున్న సమయంలో దానికే ఇంతగా బాధపడుతున్నావేంటి అంటూ రెక్లెస్‌గా మాట్లాడటంతో చేసేది లేక బాత్ రూమ్‌లోకి ఏడ్చాను అంటూ సోషల్ మీడియాకి ఎక్కింది శ్రియా శరన్.
 
శ్రియ ఇంతగా సీరియస్ అయ్యిందీ అంటే అతను ఈ అమ్మడికి ఎంతగా దగ్గరయ్యాడో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఇంతకీ అతడు ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తా లేదా పారిశ్రామికవేత్తా అనే విషయాన్ని మాత్రం బహిర్గతం చేయలేదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఖైదీ నం.150లో 'AMMADU Lets Do KUMMUDU'.. పక్కా మాస్ సాంగ్... మీరూ వినండి (ఆడియో)