Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మంచు విష్ణు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు?

Advertiesment
మంచు విష్ణు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు?
, శనివారం, 24 జులై 2021 (16:09 IST)
తెలుగు సినీపరిశ్రమలో మా ఎన్నికలు కాక పుట్టిస్తున్నాయి. ఎన్నికల్లో ముందుగా ప్యానల్ ప్రకటించిన ప్రకాష్ రాజ్ ప్రస్తుతం సైలెంట్‌గా ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఫర్వాలేదు..ఎంతమంది పోటీ చేసినా ఫర్వాలేదు. నిలబడదామన్న నమ్మకంతో ప్రకాష్ రాజ్ ఉన్నారు.
 
ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి తన ప్యానల్‌ను ప్రకటించి తాను ఎందుకు పోటీ చేస్తున్నానోనన్న విషయాన్ని చెప్పుకొచ్చారు ప్రకాష్ రాజ్. అంతటితో అయిపోయింది. మంచు విష్ణు ఇప్పటివరకు ప్యానల్‌ను ప్రకటించలేదు. అంతేకాదు ప్రకాష్ రాజ్ పై విమర్సలకు దిగాడు.
 
ప్రకాష్‌ రాజ్ స్థానికుడు కాదంటూ చెప్పుకొచ్చాడు. అంతటితో ఆగలేదు జైలుకు వెళ్ళాల్సిన వ్యక్తి ఇప్పుడు బయట తిరుగుతున్నాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడిదే సినీపరిశ్రమలో హాట్ టాపిక్ అవుతోంది. ఒక నటుడిగా ఉండి.. ఉన్నత విద్యను అభ్యసించిన వ్యక్తి ఇలా మాట్లాడుతున్నాడేంటి అనుకుంటున్నారు సినీపెద్దలు.
 
వ్యక్తిగత విమర్సలు చేయడం సరైంది కాదని.. అది ఏమాత్రం పరిశ్రమకు మంచిది కాదంటున్నారు. గతంలో ఎన్నోసార్లు ఎన్నికలు జరిగినా ఈ స్థాయిలో వ్యక్తిగత విమర్సలకు ఎవరూ వెళ్ళలేదంటున్నారు సినీవిశ్లేషకులు. అయితే తాను చేసిన వ్యాఖ్యలపై ఇంతవరకు విష్ణు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సునీల్ హీరోగా యండ‌మూరి తాజా చిత్రం "అతడు-ఆమె-ప్రియుడు"