Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

''సాహో''లో సెకండ్ హీరోయిన్‌గా ఎవెలిన్ శర్మ? 10కిలోలు తగ్గిందట?

బాహుబలి హీరో ప్రభాస్ ''సాహో'' సినిమా షూటింగ్‌లో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమా షూటింగ్ అబుదాబిలో జరుగుతోంది. భారీ యాక్షన్ సన్నివేశాలను అబుదాబిలో చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో కథానాయికగా శ్రద్ధ

Advertiesment
''సాహో''లో సెకండ్ హీరోయిన్‌గా ఎవెలిన్ శర్మ? 10కిలోలు తగ్గిందట?
, గురువారం, 19 ఏప్రియల్ 2018 (11:17 IST)
బాహుబలి హీరో ప్రభాస్ ''సాహో'' సినిమా షూటింగ్‌లో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమా షూటింగ్ అబుదాబిలో జరుగుతోంది. భారీ యాక్షన్ సన్నివేశాలను  అబుదాబిలో చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో కథానాయికగా శ్రద్ధాకపూర్ నటిస్తోంది. ప్రభాస్ కాంబినేషన్‌లోని కీలక సన్నివేశాలను ఇప్పటికే చిత్రీకరించారు.


ప్రస్తుతం ఈ చిత్రంలో మరో బాలీవుడ్ హీరోయిన్ నటించే అవకాశాలున్నట్లు టాక్ వస్తోంది. తాజాగా బాలీవుడ్ నుంచి ఎవెలిన్ శర్మను తీసుకున్నట్టు సమాచారం. పలు హిందీ చిత్రాలలో నటించిన ఈమె సాహోలో కీలక పాత్రలో కనిపించనుంది. సాహోలోని తన పాత్ర కోసం ఎవెలిన్ శర్మ వర్కౌట్లు చేసి పది కిలోల దాకా బరువు తగ్గించిందని సమాచారం. 
 
సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీకృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయాలని నిర్మాతలు ముందే నిర్ణయించారు. అయితే హిందీ హక్కుల కోసం బాలీవుడ్ నుంచి పెద్ద పోటీనే ఎదురైంది. బడా బాలీవుడ్ నిర్మాణ సంస్థలు ''సాహో'' హక్కుల కోసం పోటీపడగా.. ప్రముఖ సంస్థ టి-సిరీస్ వీటిని సొంతం చేసుకున్నట్లు బిటౌన్ వర్గాల సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

''నాపేరు సూర్య.. నా ఇల్లు ఇండియా'' ఆడియో వేదిక అక్కడే.. బన్నీ, అనూ సెల్ఫీ?