Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పుష్ప 2 లో దేవీశ్రీ ప్రసాద్ ను పక్కన పెట్టడంలో నిజమెంత?

Pushpa 2 new poster

డీవీ

, శనివారం, 9 నవంబరు 2024 (09:53 IST)
Pushpa 2 new poster
అల్లు అర్జున్ సినిమా సుకుమార్ దర్శకుడు పుష్ప 2. ఈ సినిమా షూటింగ్ లోనూ ఆ తర్వాత కూడా రకరకాల కాంట్రవర్సీలతో ప్రచారం జరుగుతోంది. రిలీజ్ డేట్ కూడా మార్పు జరగడం తెలిసిందే. అసలు సినిమా షూటింగ్ కొంతకాలం ఆగిపోవడం కూడా జరిగింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఇష్యూ కూడా పుష్ప2 సినిమా బేన్ చేయాలని కొందరు నెటిజన్ల ట్వీట్ లు వైరల్ అయ్యాయి. ఆ తర్వాత విడుదలో గందర గోళాన్ని విప్పుతూ తేదీని ప్రకటిస్తూ నిర్మాతలు ముందుకు వచ్చి డిసెంబర్ 6న రావాల్సింది 5నే విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అది కూడా ఓవర్ సీస్ మార్కెట్ ను ద్రుష్టిలో పెట్టుకుని చేశారు.
 
ఇక ఇప్పుడు తగ్గెదేలే అంటూ పుష్ప2 లో రెండు సార్లు డైలాగ్ లు చెప్పిన అల్లు అర్జున్ ఈ సినిమాలో మ్యూజిక్ లో కొంత అసంత్రుప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. దానితో దర్శకుడు సుకుమార్ కూడా మరో సంగీత దర్శకుడిని పెట్టుకున్నాడని వార్తలు వచ్చాయి. లోక్ నాథ్, ఇప్పుడు థమన్, అనిరుధ్ వంటివారు కూడా పనిచేస్తున్నట్లు సోషల్ మీడియా కేంద్రంగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. 
 
అయితే పాన్ ఇండియా సినిమా కనుక మొదట్లో అనుకున్న సన్నివేశాలు కానీ సంగీతంలో నేపథ్యం కానీ అన్నీ మారిపోతుంటాయి. ఫలానా సినిమాలో డాన్స్ బిట్ తనకు కావాలని గతంలో అల్లు అర్జున్ అడిగి జానీ మాస్టర్ ను అల్లు అర్జున్ వద్దన్న సంఘటనలు జరిగాయి. ఆ తర్వాత ఆయన అడిగిన డాన్స్ తమిళ సినిమాలో తానే చేశానని చెప్పాకకానీ హీరో స్థిమితపడలేదు. ఇప్పుడు సంగీతంలో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకుని సుకుమార్ కు ఆర్య సినిమా నుంచి జర్నీ చేస్తున్న దేవీశ్రీ ప్రసాద్ ను తప్పించారని వస్తున్న వార్తలో ఎంత నిజముందో కానీ, దీన్ని మరింత ప్రచారంగా ఉపయోగించుకోనున్నట్లు తెలుస్తోంది.
 
గతంలో ఇంద్రలో మణిశర్మ సంగీతం చేస్తుండగా, ఓ పాటకోసం  మరో సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్ ను తీసుకన్న సందర్భాలున్నాయి. ఇలా పలు సినిమాలలో ఇలా జరిగాయి. హాలీవుడ్ లో ఇలాంటివి మామూలే. కానీ మొదటి నుంచీ ఒకే సంగీత దర్శకుడిపైన పనిచేసుకుని ఇప్పుడు పుష్ప2కు మార్చడం వెనుక ప్రచార ఎత్తుగడేనా అనేది కూడా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సినిమాపై డివైడ్ టాక్ కూడా వుండడంతో మార్కెటింగ్ కూడా పెద్దగా చేయలేకపోవడంతో ఇది మరింత క్రేజ్ కు దారితీస్తుందనేది వినిపిస్తోంది. దీనిపై చిత్ర నిర్మాతలు మరోసారి మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇస్తారో లేదో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కె.సి.ఆర్. టైటిల్ తో రాకింగ్ రాకేష్ చేసిన చిత్రం ఎంతవరకు వచ్చింది