Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మోక్షజ్ఞతో శ్రీలీల మాటామంతి... ఫోటోలు వైరల్

Advertiesment
Sreeleela
, బుధవారం, 30 ఆగస్టు 2023 (18:31 IST)
Sreeleela
నందమూరి హీరో బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి చిత్రం షూటింగ్‌లో బిజీ బిజీగా వున్నారు. ఈ సినిమా దసరా కానుకగా సినీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శ్రీలీల కీలక పాత్రలో కనిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్ సెట్స్‌లో ఓ ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది.
 
ఈ మూవీ సెట్స్‌లోకి బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇచ్చాడు. బ్లాక్ షర్ట్ వేసుకుని స్టైల్‌గా కళ్లజోడుతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ సందర్భంగా మోక్షజ్ఞతో శ్రీలీల మాటామంతీ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. శ్రీలీల-మోక్షజ్ఞతో ముచ్చటించిన ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈ ఫోటోలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లావణ్యతో రొమాన్స్ చేసేందుకు ఇబ్బంది పడిన ఆ హీరో.. ఒక్క రోజంతా పట్టిందట!