Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యూ-టర్న్ కోసం.. పారితోషికంతో పనిలేదంటున్న సమంత?

''రంగస్థలం'' సినిమాకు తర్వాత అందాల రాశి సమంత తన తదుపరి సినిమా కోసం పారితోషికాన్ని తగ్గించేయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. సమంత తదుపరి సినిమాపై కన్నేసింది. యూ-టర్న్ సినిమాపై సమంత పూర్తి ద

Advertiesment
యూ-టర్న్ కోసం.. పారితోషికంతో పనిలేదంటున్న సమంత?
, బుధవారం, 21 ఫిబ్రవరి 2018 (12:26 IST)
''రంగస్థలం'' సినిమాకు తర్వాత అందాల రాశి సమంత తన తదుపరి సినిమా కోసం పారితోషికాన్ని తగ్గించేయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. సమంత తదుపరి సినిమాపై కన్నేసింది. యూ-టర్న్ సినిమాపై సమంత పూర్తి దృష్టి సారించింది. ఈ చిత్రంలో సమంత వైవిధ్యమైన పాత్రలో కనిపించనుంది.
 
ఈ పాత్ర తెగ నచ్చేయడంతో ఆమె పారితోషికాన్ని కూడా తగ్గించేసుకుందని టాక్ వస్తోంది. యూ-టర్న్ సినిమా షూటింగ్ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఇక్కడ సమంతపై కలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
 
కథానాయిక ప్రాధాన్యత కలిగిన చిత్రం కావడంతో ఓ మాదిరి బడ్జెట్‌తో ఈ సినిమా నిర్మాణం జరుగుతోంది. సమంత కెరీర్‌లో అతి తక్కువ బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమా ఇదని టాక్. అయితే పాత్ర నచ్చడంతో.. ఆ పాత్రకు ప్రాధాన్యత వుండటంతో పారితోషికంతో పనిలేకుండా సమ్మూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని టాక్ వస్తోంది.
 
కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన యూ-టర్న్‌కు రీమేక్‌గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. కన్నడ దర్శకుడు పవన్ కుమారే షూట్ చేస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో ఆది పినిశెట్టి కీలక పాత్రలో కనిపిస్తున్నాడని.. రాహుల్ రవిచంద్రన్ సమంత బాయ్‌ఫ్రెండ్‌గా కనిపిస్తాడని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అన్నకు హిట్ దక్కాలని తమ్ముడి తహతహ...