Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలుగు చదవడమే రాదు.... కానీ తెలుగు సినీరంగంలో పెద్దపెద్ద స్టార్లు...

తెలుగు సినీ రంగానికి గోల్డెన్ పీరియడ్‌గా చెప్పుకునే కాలానికి చెందిన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వీఆర్, సావిత్ర వంటి మహా నటులు తెలుగు భాషకు పట్టం కట్టి, తమ స్పష్టమైన వాచకంతో తెలుగంటే ఇలా మాట్లాడాలి అనే స్థాయ

తెలుగు చదవడమే రాదు.... కానీ తెలుగు సినీరంగంలో పెద్దపెద్ద స్టార్లు...
, బుధవారం, 19 జులై 2017 (13:00 IST)
తెలుగు సినీ రంగానికి గోల్డెన్ పీరియడ్‌గా చెప్పుకునే కాలానికి చెందిన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వీఆర్, సావిత్ర వంటి మహా నటులు తెలుగు భాషకు పట్టం కట్టి, తమ స్పష్టమైన వాచకంతో తెలుగంటే ఇలా మాట్లాడాలి అనే స్థాయి ప్రతిభ కనబర్చి ఉంటే, నేటి తరం తెలుగు కథనాయకులకు కనీసం తెలుగు భాష చదవడం కూడా రాకపోవడం ఎంతో విచారకరం.. అందుకేనేమో బహుశా నేటి తరం సినిమాల్లో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ముచ్చుకైనా కనిపించడం లేదు. ఏదో ఒకటి అరా అభిరుచి కలిగిన నిర్మాత, దర్శకులను మినహాయిస్తే.... ఇన్నేళ్లబట్టి ఉంటున్నా కనీసం తెలుగు నేర్చుకోవడానికి కూడా సమయం కేటాయించలేకపోతున్న కథనాయకుల జాబితా ఇదే.
 
టాప్ 1 చైర్ కైవసం చేసుకోవడానికి పోటీ పడుతున్న మహేష్ బాబు, అల్లు అర్జున్ సహా నాగ చైతన్య, తరుణ్, శిరీష్, మంచు లక్ష్మీ, నిహారికా వీళ్లెవరికీ తెలుగు రాయడంగానీ, చదవడంగానీ రాదని సినీ వర్గాలు కోడై కూస్తున్నాయి. ఈ విషయం మహేష్ బాబు కొన్ని సందర్భాల్లో బాహాటంగానే ప్రకటించాడు కూడా. ఈ సినీ వారసుల విద్యాభ్యాసమంతా ఇతర రాష్ట్రాల్లో సాగడంతో, వీరికి అప్పుడు తెలుగు నేర్చుకునే వీలు కుదరలేదు. కనీసం వారికి నటవారసత్వంలో శిక్షణ ఇప్పించిన తల్లిదండ్రులు కూడా తెలుగు భాష నేర్పించడంపై శ్రద్ధ చూపలేదు. అంతేందుకు.. అత్యంత సహజ నటిగా పేరు తెచ్చుకున్న జయసుధకు కూడా అసలు తెలుగు చదవడం, రాయడం రాదంటే నమ్మగలమా?

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సంజన న్యూడ్ సీన్.. పూజా గాంధీ లిప్‌లాక్ కిస్.. మేకింగ్ వీడియో