Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రతినిర్వేదం కంటే సాల్ట్ అండ్ పెప్పర్ కలిసిన బోల్డ్ సినిమాల్లో నటించాలనుంది: శ్వేత

రతినిర్వేదం కంటే కైపెక్కించే సినిమా చేయాలని ఉందని శ్వేత మీనన్ వెల్లడించింది. హాట్ హాట్ సీన్లలో నటించేందుకు ఏమాత్రం వెనుకాడని ఈ భామకు అభిమానులను కైపెక్కించడమంటే తనకు పిచ్చి అంటోంది. రతినిర్వేదం సినిమాల

Advertiesment
swetha menon comments on hot roles
, బుధవారం, 12 అక్టోబరు 2016 (17:58 IST)
రతినిర్వేదం కంటే కైపెక్కించే సినిమా చేయాలని ఉందని శ్వేత మీనన్ వెల్లడించింది. హాట్ హాట్ సీన్లలో నటించేందుకు ఏమాత్రం వెనుకాడని ఈ భామకు అభిమానులను కైపెక్కించడమంటే తనకు పిచ్చి అంటోంది. రతినిర్వేదం సినిమాలో కీలకరోల్ చేసిన శ్వేత, దక్షిణాదిన ఎంతోమంది ప్రేక్షకుల మదిని కొల్లగొట్టింది.

ప్రస్తుతం తెలుగులో నేరుగా ఒక్క సినిమాలోనైనా నటించని శ్వేత మీనన్ డబ్బింగ్ మూవీలతోనే దక్షిణాది సినీ ప్రేక్షకులకు దగ్గరైంది. ఈ నేపథ్యంలో శ్వేత మాట్లాడుతూ.. తనకు మాత్రం రోమాంటిక్ సీన్స్ చేయడం చాలా ఇష్టమంటోంది. అంతేకాదు, రతినిర్వేదం సినిమాకు మించిన బోల్డ్ సినిమాల్లో నటించాలని ఉందట.
 
రతినిర్వేదం వంటి చిత్రాలు, లైవ్ డెలివరీ సీన్ వంటి వివాదాలు శ్వేత మీనన్‌ని పాపులర్ చేశాయి. కొంత గ్యాప్ తీసుకున్న శ్వేతామీనన్ తాజాగా సరికొత్త స్లిమ్ లుక్‌తో నవల్ ఎన్న జువెల్ అనే మలయాళం సినిమాతో మళ్లీ ఆడియెన్స్ ముందుకు వస్తోంది.

సాల్ట్ అండ్ పెప్పర్ సినిమాలో లాంటి లైట్ పాత్రలు లేదా రతినిర్వేదం సినిమా కన్నా కైపెక్కించే పాత్రలు గల సినిమాల్లో నటించాలనుంది. అందుకే కాస్త డిఫరెంట్‌గా ఉండే సినిమాలు చేయాలనే ఉద్దేశంతో ఈ నవల్ ఎన్న జువెల్ సినిమాకి సైన్ చేశానని చెప్పింది. సో.. శ్వేత మరోసారి వెండితెరమీద సంచలనం కాబోతోందన్నమాట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డైలాగ్‌ పాతదే అయినా... కథ మీద చరణ్‌ విశ్వాసం... 'ధృవ' కెపాసిటీ ఏంటో?