Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యాంకర్ శ్రీముఖి ఏం చేసిందో తెలుసా...?

శ్రీముఖి. బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చిన నటి. చిన్నచిన్న క్యారెక్టర్లనే బుల్లితెరపై చేసుకుంటూ అందరినీ ఆకట్టుకుంది శ్రీముఖి. అయితే ప్రస్తుతం శ్రీముఖి రెచ్చిపోతోంది. ఎందులోనంటారా.. వెండితెరపై. అది కూడా అందాలను ఆరబోయడంలో ముందుంతోందట. ఎలాంటి క్యారెక్ట

Advertiesment
Srimukhi hot
, మంగళవారం, 28 మార్చి 2017 (20:51 IST)
శ్రీముఖి. బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చిన నటి. చిన్నచిన్న క్యారెక్టర్లనే బుల్లితెరపై చేసుకుంటూ అందరినీ ఆకట్టుకుంది శ్రీముఖి. అయితే ప్రస్తుతం శ్రీముఖి రెచ్చిపోతోంది. ఎందులోనంటారా.. వెండితెరపై. అది కూడా అందాలను ఆరబోయడంలో ముందుంతోందట. ఎలాంటి క్యారెక్టర్లను చేయడానికి సిద్ధంగా ఉందట. ఇప్పటివరకు నేను శైలజ లాంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న శ్రీముఖి తాజాగా విడుదల కాబోతున్న బాబు బాగా బిజీ, మరో సినిమాల్లో అందాలను తెగ ఆరబోసిందట.
 
డైరెక్టర్ చెప్పగానే ఎగిరి గంతేసే పొట్టిపొట్టి డ్రస్సులతో కొన్ని సీన్లలో నటించిందట శ్రీముఖి. శ్రీముఖిని వెండితెరపై చూసిన చిత్ర యూనిట్ ఈమె ఎందుకిలా చేస్తుందని ఆశ్చర్యపోయారట. ఇప్పటికే అనసూయ, శ్యామల లాంటి యాంకర్లే ఆచితూచి అడుగేస్తూ అలా బుల్లితెరలపైనా, ఇటు సినిమాల్లోనూ రాణిస్తున్నారు. కానీ ఒకే ఒక షో (పటాస్) మంచి పేరు తెచ్చుకున్న శ్రీముఖి ఆ షోతోనే చెడ్డపేరు మూడగట్టుకుందట. కారణం జబర్‌దస్త్‌ను మించిన బూతు డైలాగులు శ్రీముఖి ఇందులో చెప్పడమే. 
 
ఇందులో ఉన్న మరో యాంకర్ రవితో కలిసి ఆమె చెప్పే బూతు పదాలతో చాలామంది టీవీలను కూడా కట్టేస్తున్నారట. మరి శ్రీముఖి నటించిన కొత్త రెండు సినిమాలు ఎప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుందో ఏమోకానీ, శ్రీముఖి వ్యవహారం మాత్రం ప్రస్తుతం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూ. 2000 కోట్ల డ్రగ్స్ రాకెట్... నటి మమతా కులకర్ణికి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్....