హీరోయిన్ అంటే సౌందర్య లాగా ఉండాలి. అలాంటి క్యారెక్టర్లు చేయడమంటేనే నాకు ఇష్టం. అందుకే బుల్లితెర మీద నుంచి వెండితెరపైకి వచ్చాను. కొన్ని సినిమాల్లో చేశాను. అయితే ఆ సినిమాల్లో కూడా దర్సకులు లిప్ లాకింగ్ చేయాలి.. అందాలు ఆరబోయాలి అన్నారు. ఏదైనా సరే పరిమితంగా ఉంటే మంచిదని ఒకే చెప్పా. కొన్ని చిన్న సినిమాల్లో నటించా.
అయితే మళ్ళీ మళ్లీ అవకాశాలు వస్తున్నాయి కానీ... అందులో మరీ ఎక్కువగా అంగాంగ ప్రదర్సన చేయాల్సిన ఉంటుందని దర్సకులు మరీ పబ్లిక్‌గా అడిగేస్తున్నారు. ముఖ్యంగా కుటుంబ సభ్యుల ముందే దర్సకులు అలా మాట్లాడారు. దీంతో నేను ఇక సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నాను.
నేను చిన్న పిల్లను కాదు. మా కుటుంబ సభ్యులు దర్సకులు చెప్పిన మాటలు విని లేచి వెళ్ళిపోయారు. అంటే నిర్ణయం నీదేనని వారు చెప్పకనే చెప్పారు. నామీద గౌరవంతో వారు అలా చేశారు. కాబట్టి నేను కూడా కుటుంబ సభ్యులకు గౌరవమివ్వాలి కదా. అందుకే ఇక వెండితెరమీద చేయకూడదని నిర్ణయానికి వచ్చేశానని చెబుతోంది శ్రీముఖి.
ఎన్నో అవకాశాలు వచ్చినా బుల్లితెరతోనే సరిపెట్టుకుంటానని దర్సకనిర్మాతలకు చెప్పేస్తోందట. ప్రస్తుతం లాక్ డౌన్ ఉండగా ఇది ముగిసిన తరువాత రెండు సినిమాల్లో నటించడానికి శ్రీముఖికి అవకాశం వస్తే ఇలా చెప్పేసిందట.