Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఇద్దరూ నాకు మంచి స్నేహితులు: అరుంధతి విలన్

తెలుగు ఇండస్ట్రీలో వదల బొమ్మాళీ.. వదలా.. అంటూ 'అరుంధతి' చిత్రంలో అఘోరాగా వేసిన బాలీవుడ్ నటుడు సోనూసూద్ 'అబ్బాయిలు.. అమ్మాయిలు' చిత్రంలో సినీపరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత విలన్‌గా క్యారెక్టర్ ఆర్

Advertiesment
షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఇద్దరూ నాకు మంచి స్నేహితులు: అరుంధతి విలన్
, సోమవారం, 26 సెప్టెంబరు 2016 (15:50 IST)
తెలుగు ఇండస్ట్రీలో వదల బొమ్మాళీ.. వదలా.. అంటూ 'అరుంధతి' చిత్రంలో అఘోరాగా వేసిన బాలీవుడ్ నటుడు సోనూసూద్ 'అబ్బాయిలు.. అమ్మాయిలు' చిత్రంలో సినీపరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత విలన్‌గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగులో మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. సూపర్ చిత్రంలో నాగార్జునతో సమానంగా నటించాడు. తెలుగు, హిందీ సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సోనూ అందరితోనూ స్నేహంగానే ఉంటాడు.
 
అందుకే బాలీవుడ్‌ అగ్రనటులు షారుక్‌.. సల్మాన్‌లకూ దగ్గరవ్వగలిగాడు. అయితే తాను ఒకరిని ఎక్కువ.. మరొకరిని తక్కువ చేసి చూడనని అంటున్నాడు సోనూ. తనకు ఇద్దరూ సమానమేనని చెబుతున్నాడు. సినీ పరిశ్రమలో ఉన్న ప్రతి యొక్కరితోనూ... స్నేహంగానే ఉంటా. అందువల్ల నాకు ఏ బ్యానర్‌లో నటించే అవకాశం వచ్చినా ఇబ్బందిగా ఉండదు. 
 
బాలీవుడ్‌లో షారుక్‌.. సల్మాన్‌ ఇద్దరూ నాకు మంచి స్నేహితులు. నా దృష్టిలో ఆ ఇద్దరూ సమానమే. ఇద్దరితో ఒకేవిధంగా ఉంటాను. అంతెందుకు.. ''హ్యాపీ న్యూ ఇయర్''’ చిత్ర షూటింగ్‌ సమయంలో సల్మాన్‌తో లంచ్‌కి వెళ్లేవాడిని. వెంటనే వచ్చి షారుక్‌తో షూటింగ్‌లో పాల్గొనేవాడిని. అలా అని ఒకరి విషయాలు మరొకరి వద్ద ఎప్పుడూ చర్చించలేదు. షారుక్‌.. సల్మాన్‌ ఇద్దరూ గొప్పవ్యక్తులు. అనుభవజ్ఞులు. ఎదుటి మనిషిని సులువుగా అర్థం చేసుకుంటారుట అని తన మనసులోని మాటను చెప్పుకొచ్చాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు 'కాటమరాయుడు' హితబోధ... నోట్‌బుక్‌లో స్వదస్తూరితో కొన్ని సూక్తులు