'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' చిత్రంలో శరణ్య ప్రదీప్ కీలక పాత్రను పోషించింది. ఈ సినిమాలో ఆమె హీరో కంటే ఎక్కువ పవర్ఫుల్ రోల్‌లో పోషించింది. విలన్‌ను సైతం ధైర్యంగా ఎదుర్కునే పాత్ర ఇది. ఈ సినిమాకి వెళ్లిన ప్రేక్షకుల నుంచి ఆమె పాత్ర ఎక్కువ ప్రశంసలను అందుకుంటుంది.
త్వరలో ఆహా ద్వారా పలకరించనున్న భామాకలాపం-2లో ఆమె కీలకమైన పాత్రను పోషించింది. ప్రియమణితో పాటు సమానంగా స్క్రీన్‌పై కనిపించే శిల్ప పాత్ర అది.
ఇకపై ఇలాంటి పవర్ ఫుల్ రోల్స్ పోషించేందుకు రెడీగా వున్నట్లు ప్రకటించింది. అలాగే విలన్ రోల్స్ చేసేందుకు కూడా సై అంటోంది. ఇకపై ఆమె మరింత బిజీ అయినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు.