బాలీవుడ్ 'మహాభారతం'.. కృష్ణుడుగా అక్షయ్ కుమార్.. భీష్ముడు... ద్రౌపది... పంచ పాండవులుగా ఎవరు?
బాలీవుడ్ "మహాభారతం" నిర్మాణానికి నటీనటుల ఎంపికను పూర్తి చేశారు. శ్రీకృష్ణ పాత్రధారిగా బాలీవుడ్ అక్షయ్ కుమార్... ద్రౌపదిగా ప్రియాంకా చోప్రా, భీష్ముడిగా అమితాబ్ బచ్చన్ పేర్లను ఖరారు చేశారు. ముఖ్యంగా పం
బాలీవుడ్ "మహాభారతం" నిర్మాణానికి నటీనటుల ఎంపికను పూర్తి చేశారు. శ్రీకృష్ణ పాత్రధారిగా బాలీవుడ్ అక్షయ్ కుమార్... ద్రౌపదిగా ప్రియాంకా చోప్రా, భీష్ముడిగా అమితాబ్ బచ్చన్ పేర్లను ఖరారు చేశారు. ముఖ్యంగా పంచ పాండవులుగా ఆ ఐదుగురు హీరోలను ఎంపిక చేశారు. ఇక దుర్యోధన పాత్రధారిగా బాలీవుడ్లో అనేక నెగెటివ్ పాత్రల్లో నటించిన బిగ్ హీరో నటించనున్నారు.
హాలీవుడ్ హయ్యస్ట్ బడ్జెట్ మూవీస్‌ను తలదన్నే రీతిలో 'మహాభారతం'ను తెరకెక్కిస్తానని బాలీవుడ్ స్టార్ షారూక్ ఖాన్ ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ బడ్జెట్ కోసం వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్టు ప్రకటించారు. అలాగే, టాలీవుడ్లో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కూడా మహాభారత్‌ను తెరకెక్కించనున్నట్టు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు బాలీవుడ్లో 'మహాభారతం' తీస్తే.. అందులో ఏ పాత్రకు ఏ నటీనటులు సరిపోతారనే అంశంపై వాడివేడిగా చర్చలు సాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో శ్రీకృష్ణుడిగా బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్. మహాభారత ఇతిహాసంలో కృష్ణుడు పాత్ర తనకు అమిత ఇష్టమని, ఒకవేళ రాజమౌళి మహాభారతాన్ని తెరకెక్కిస్తే.. అందులో కృష్ణుడు పాత్రను తానే చేస్తానని ముందుగానే 'మహాభారతం'లో కృష్ణుడు పాత్రకు బెర్త్ కన్ఫామ్ చేసుకున్న విషయం తెల్సిందే.
అలాగే, పంచ పాడవులుగా ధర్మరాజుగా అక్షయ్ కుమార్, భీముడుగా సంజయ్ దత్, అర్జునుడుగా హృతిక్ రోషన్, నకులుడుగా సిద్ధార్థ్ మల్హోత్రా, సహదేవుడుగా వరుణ్ ధావణ్ అయితే బాగుంటారట. అలాగే పాండవుల పత్ని ద్రౌపదిగా ప్రియాంక చోప్రాకే ఎక్కువమంది మొగ్గు చూపారు.
దుర్యోధనుడిగా షారూక్ ఖాన్ అయితే సరిపోతారట. ఇక.. కౌరవ స్థావరంలో అత్యంత బలవంతుడు, దానశీలుడు కర్ణుడు పాత్రకుగానూ అజయ్ దేవగణ్ సరిపోతాడట. మహాభారతంలో కురువృద్ధుడు భీష్మ పితామహపాత్రలో బాలీవుడ్ నట కురువృద్ధుడు అమితాబ్ బచ్చన్ తప్ప వేరే ఆప్షన్ లేదని చెపుతున్నారు.
ఇక 'మహాభారతం'ను మలుపుతిప్పే మరో కీలక పాత్ర శకునిగా నటించేందుకు ఇర్ఫాన్ ఖాన్, నవాజుద్దీన్ సిద్ధిఖీ బాగుంటారని నెటిజన్లు భావిస్తున్నారు. అయితే ఈ డ్రీమ్ ప్రాజెక్టు కోసం ఈ పాత్రల కోసం నటీనటుల ఎంపిక నెటిజన్స్ చేశారు.