అక్కినేని నాగ చైతన్య, హీరోయిన్ సమంతలు భార్యాభర్తలుగా మారిపోయారు. వివాహం తర్వాత వీరిద్దరూ కలిసి ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం పేరు అధికారికంగా వెల్లడించలేదు. కానీ, ఈ చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియో ఒకటి నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. 'నిన్నుకోరి' ఫేం శివ దర్శకత్వంలో వీరిద్దరూ కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సాహు, హరీష్ నిర్మిస్తున్నారు.
కాగా ఈ చిత్రానికి "మజిలి" అనే టైటిల్ పెడుతున్నట్లు సమాచారం. చైతన్య కుర్చీలో కూర్చుని ఉండగా సమంత పక్కనే ఉండి ఏదో మాట్లాడుకుంటున్న 35 సెకన్ల వీడియోను సమంతకు ఆమె అభిమాని షేర్ చేశారు. ఈ వీడియోపై చూసిన సమంత షాక్ అయింది. అవాక్ అయిన ఎమోజీలను పోస్ట్ చేశారు. తర్వాత ఆమె ఆ ట్వీట్‌ను డిలీట్ చేశారు.