సమంతకు ఏమైంది..? రజినీకాంత్ అల్లుడు సినిమాకు నో అనేసిందట...
ఈమధ్య సమంత చాలా వింతగా ప్రవర్తిస్తోందట. సినిమాల్లో నటించమని అడుగుతుంటే... అబ్బే ప్రస్తుతానికి నేను చిత్రాలు చేయదలుచుకోలేదు అంటూ సమాధానం ఇస్తోందట. అంతేకాదు రజినీకాంత్ అల్లుడు ధనుష్‌తో నటిస్తున్న వాడ చెన్నై చిత్రానికి తీసుకున్న అడ్వాన్సును తిరిగి ఇచ్చే
ఈమధ్య సమంత చాలా వింతగా ప్రవర్తిస్తోందట. సినిమాల్లో నటించమని అడుగుతుంటే... అబ్బే ప్రస్తుతానికి నేను చిత్రాలు చేయదలుచుకోలేదు అంటూ సమాధానం ఇస్తోందట. అంతేకాదు రజినీకాంత్ అల్లుడు ధనుష్‌తో నటిస్తున్న వాడ చెన్నై చిత్రానికి తీసుకున్న అడ్వాన్సును తిరిగి ఇచ్చేసిందట.
అంతేకాదు... ఇంకా మరికొన్ని చిత్రాలకు సంబంధించి ఆఫర్లు వస్తున్నా తిప్పికొడుతోందట. దీనితో కోలీవుడ్ సినీజనం అసలు సమంతకు ఏమైంది అంటూ గుసగుసలు పోతున్నారట. మరోవైపు సమంత-నాగచైతన్యలు ప్రేమలో పడ్డారనీ, ఇద్దరికి డిసెంబరు నెలలో పెళ్లి జరుగబోతోందనీ ప్రచారం కూడా ఊపందుకోవడంతో.... సమంత చిత్రాలను అంగీకరించకపోవడానికి కారణం ఇదేనేమో అని కోలీవుడ్ సినీజనం అనుకుంటున్నారట.