Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పవన్ కళ్యాణ్ ఫోటోలు నేనెందుకు షేర్ చేయకూడదు : రేణూ దేశాయ్

ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ నుంచి విడాకులు తీసుకున్న రేణు దేశాయి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారుతున్నాయి. విడిపోయినా తాను, పవన్ కళ్యాణ్ స్నేహితులు మాదిరే ఉంటామని, రోజూ ఫోన్‌లో మాట్లాడుకుంటామని ఆమె

Advertiesment
Renu Desai
, గురువారం, 15 సెప్టెంబరు 2016 (09:41 IST)
ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ నుంచి విడాకులు తీసుకున్న రేణు దేశాయి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారుతున్నాయి. విడిపోయినా తాను, పవన్ కళ్యాణ్ స్నేహితులు మాదిరే ఉంటామని, రోజూ ఫోన్‌లో మాట్లాడుకుంటామని ఆమె చెప్పిన సంగతి తెలిసిందే. తమ పిల్లల పట్ల ఇద్దరం ప్రేమగా ఉంటామని, పవన్ కూడా నిత్యం పిల్లల గురించి శ్రద్ద తీసుకుంటారని ఆమె చెప్పారు. తన జీవితంలో జరిగే ప్రతి విషయం పవన్‌కు తెలుసునని కూడా ఆమె అన్నారు. మా వివాహం సఫలం కాకపోవచ్చు... కానీ, పరస్పరం గౌరవించుకుంటామని, పవన్ అంటే తనకు అభిమానమని ఆమె చెప్పారు. 
 
ఎక్కడైనా అబ్యంతర వ్యాఖ్యలు వచ్చినా, పట్టించుకోవద్దని పవన్ చెప్పారని ఆమె వివరించారు. అంతేకాదు..''కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటోంది రేణూ. అయితే ఇలా ఫోటోలను పంచుకోవడం వల్ల మళ్లీ పవన్ కళ్యాణ్ - రేణు కలవబోతున్నారా..! లేక పవన్‌ను మరచిపోలేకనే ఇలా పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటుందా..? లేక పవన్ కళ్యాణ్‌ను వాడుకొని ఇలా రేణు పబ్లిసిటీని సంపాదించుకుంటుందా...? అని రకరకాలుగా కామెంట్స్ రావడంతో రేణు ఆ వార్తలపై తనదైన శైలిలో స్పందించింది. 
 
రేణు తన ట్విట్టర్‌లో మాట్లాడుతూ...''పవన్ కళ్యాణ్ గురించి మీరంతా మాట్లాడుకోవచ్చా.. మీరు అన్ని ఫొటోస్ షేర్ చేయచ్చు కానీ నేను మాత్రం ఎందుకు చేయకూడదు.. అయన ఫోటో పెడితే ఇప్పుడు ఆమెకు పవన్ గురించి మాట్లాడటం అవసరమా. పబ్లిసిటీ కోసమే ఇదంతా చేస్తోంది అంటున్నారు''. అసలు నేనేందుకు ఆయన గురించి మాట్లాడకూడదు. నేను ఆయన విడాకులు తీసుకున్నంత మాత్రానా మా మధ్య రిలేషన్ పోయినట్టేనా" అంటూ ఘాటు సమాధానమిచ్చింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఓనం పండుగను జరుపుకున్న నయనతార