Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నా రేటు కోటి... అంటున్న ల‌క్కీగాళ్ ర‌కుల్!

జిమ్ బాడీ... డైన‌మిక్ లేడీ... చారెడేసి క‌ళ్ళ‌తో ఇటు టాలీవుడ్‌ని అటు బాలీవుడ్ని షేక్ చేస్తున్న ర‌కుల్ ప్రీత్ సింగ్ ఇపుడు త‌న రేటు అమాంతం పెంచేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు ల‌క్ష‌లు డిమాండు చేసిన ర‌కుల్... ఇపుడు కోట్ల‌కు త‌న పారితోషికం పెంచేసింది. హిట్ హీరోయిన

Advertiesment
నా రేటు కోటి... అంటున్న ల‌క్కీగాళ్ ర‌కుల్!
, సోమవారం, 24 అక్టోబరు 2016 (13:40 IST)
జిమ్ బాడీ... డైన‌మిక్ లేడీ... చారెడేసి క‌ళ్ళ‌తో ఇటు టాలీవుడ్‌ని అటు బాలీవుడ్ని షేక్ చేస్తున్న ర‌కుల్ ప్రీత్ సింగ్ ఇపుడు త‌న రేటు అమాంతం పెంచేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు ల‌క్ష‌లు డిమాండు చేసిన ర‌కుల్... ఇపుడు కోట్ల‌కు త‌న పారితోషికం పెంచేసింది. హిట్ హీరోయిన్‌గా టాక్ రావ‌డంతో ఈ బ్యూటీ త‌న ఫీజు పెంచేసింద‌టున్నారు నిర్మాత‌లు.
 
అయినా ఆమె ల‌క్కీ గాళ్... అందుకే అడిగింది ఇచ్చేయాల్సిందే అంటూ, స‌ర్దిచెప్పుకుంటున్నారు నిర్మాత‌లు. ర‌కుల్ ఉంటే, త‌మ‌కు లక్కీగాళ్‌గా ఫీల‌య్యే హీరోలున్నారు. ర‌కుల్ హీరోయిన్ అయితే... నేను కూడా రెచ్చిపోతా అంటున్న యువ హీరోల కోసం నిర్మాత‌లు కూడా కోటి రెమ్యూన‌రేష‌న్ పైన ఎలాంటి అభ్యంత‌రాలు చెప్ప‌డం లేదు. అంతేమ‌రి అందం ఉన్న‌పుడే ఇండ‌స్ట్రీని చ‌క్క‌బెట్టాయ‌ల‌నేది... సినీ సామెత‌.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈజిప్టులో ఇద్దరు మైనర్లకు నిశ్చితార్థం.. సర్వత్రా విమర్శలు.. సర్కారు ఏం చేస్తుందో?