Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మీడియా ముందుకు రావొద్దని రాధికకు గట్టిగా వార్నింగ్ ఇచ్చిన దర్శకనిర్మాతలు

హాట్‌ బ్యూటీ రాధిక ఆప్టే దక్షిణాది సూపర్ స్టార్‌ రజినీకాంత్‌ సరసన ''కబాలి'' చిత్రంలో నటించి అందరిని ఆకట్టుకున్న విషయం తెలిసిందే. కాని ఆ సినిమాలో పద్దతిగా నటించిన రాధిక ఆప్టే బాలీవుడ్‌లో ఒక సినిమాలో మ

Advertiesment
Radhika Apte's
, బుధవారం, 24 ఆగస్టు 2016 (13:04 IST)
హాట్‌ బ్యూటీ రాధిక ఆప్టే దక్షిణాది సూపర్ స్టార్‌ రజినీకాంత్‌ సరసన ''కబాలి'' చిత్రంలో నటించి అందరిని ఆకట్టుకున్న విషయం తెలిసిందే. కానీ ఆ సినిమాలో పద్దతిగా నటించిన రాధిక ఆప్టే బాలీవుడ్‌లో ఒక సినిమాలో మాత్రం కుర్రకారుని మత్తెక్కించేలా హాట్ హాట్‌గా నటించింది. ఈ సినిమాలో ఎన్నో న్యూడ్‌ సీన్స్‌ ఉన్నట్లుగా తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాలో ఒక న్యూడ్‌ వీడియో లీక్ అవడం... ఈ వీడియోను చిత్ర ప్రమోషన్‌ కోసం యూనిట్‌ సభ్యులు లీక్‌ చేస్తున్నట్లుగా గుసగుసలు వినిపించిన విషయం తెలిసిందే.  
 
హాలీవుడ్‌లో న్యూడ్‌ సీన్స్‌కు ఫర్వాలేదు కానీ, బాలీవుడ్‌లో అవి కుదరదు. అందుకే బాలీవుడ్‌లో ప్రచారం కోసం ఇలా లీక్‌ చేస్తున్నారని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అయితే వీటితో తమకు ఎటువంటి సంబంధం లేదని, ఈ సినిమాను ఒక అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించామని ఈ వీడియోలు అక్కడినుంచే లీక్ అయి ఉంటాయని సినీ దర్శకనిర్మాతలు తమదైన శైలిలో వివరణ ఇచ్చారు. అంతేకాదు ఈ చిత్ర దర్శకుడు మరొక అడుగు ముందుకేసి.. రాధిక ఆప్టే తన చెల్లెలిలాంటిదని మరో సంచలనం సృష్టించారు. 
 
కాగా ఈ లీకింగ్ వీడియో గురించి మరో సంచలన వార్త బాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో లీక్ అయిన వెంటనే మీడియా ముందుకు రావొద్దని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి ప్రకటన చేయొద్దని ఈ చిత్ర దర్శకనిర్మాతలు రాధికకు గట్టిగా సూచించారని బాలీవుడ్ వర్గాల విశ్వసనీయ సమాచారం. దీనిని బట్టి చూస్తుంటే రాధికకు ఒకరకంగా వార్నింగ్ ఇచ్చినట్టేనని బాలీవుడ్‌ జనాలు గుసగుసలాడుకుంటున్నారు. అంతేకాదు, ఈ వ్యవహారం వల్ల రాధిక ఇమేజ్‌కు జరిగిన నష్టానికి కొంత పరిహారం సైతం చెల్లించి ఆమె నోరు మూయించారని వార్తలు వెలువడుతున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే ఈ భామ నోరువిప్పాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నయీమ్ లేదనుకుంటే కష్టమే.. ఆయన అనుచరులు ఇంకా ప్రాణాలతో ఉన్నారు..!