Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సరికొత్త ఫిజిక్‌తో సిత్రాన్ని రిలీజ్ చేసి... ఫిదా చేసిన రత్తాలు

Advertiesment
సరికొత్త ఫిజిక్‌తో సిత్రాన్ని రిలీజ్ చేసి... ఫిదా చేసిన రత్తాలు
, సోమవారం, 13 జులై 2020 (15:17 IST)
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఐటమ్ గర్ల్‌గా మంచి పేరు సంపాదించిన భామ రాయ్ లక్ష్మీ. మెగాస్టార్ చిరంజీవి న‌టించిన "ఖైదీ నెం 150"వ చిత్రంలో ర‌త్తాలు అనే సాంగ్‌తో ఈ ముద్దుగుమ్మ దుమ్మురేపింది. 
 
సీనియ‌ర్ హీరోల‌తో పాటు కుర్ర స్టార్స్‌తోను కాలు క‌దుపుతున్న ఈ అమ్మ‌డికి ప్ర‌స్తుతం సరైన ఆఫ‌ర్స్ రావ‌డం లేదు. దీంతో త‌న ఫిజిక్‌పై దృష్టి పెట్టింది. లాక్డౌన్ స‌మ‌యంలో వ‌ర్క‌వుట్స్ చేస్తూ స‌రైన డైట్ పాటిస్తూ జీరో సైజ్‌కి మారింది. 
 
ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డి ఫోటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుండగా, నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. రాయ్ ల‌క్ష్మీ ఆ మ‌ధ్య ప్ర‌ధాన పాత్ర‌లో ఓ సినిమా చేసిన‌ప్ప‌టికీ, ఆ సినిమా మంచి విజ‌యం సాధించ‌లేక‌పోయింది. 
 
దీంతో ఐటెం సాంగ్స్‌కే ప‌రిమిత‌మవుతుంది. బాలీవుడ్‌లో 'ఆఫీసర్ అర్జున్ సింగ్ - ఐపీఎస్ బ్యాచ్ 2000' అనే చిత్రంలో ఐటెమ్ నంబరులో ఆడిపాడుతోంది. అలాగే ఝాన్సీ, సిండ్రెల్లా, ఆనంద భైరవి అనే చిత్రాలు సెట్స్‌పై ఉన్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'స్వాతిచినుకులు' నటుడు భరద్వాజ్‌కు కరోనా