ఢిల్లీకి చెందిన ప్రగతి శ్రీవాత్సవ్ టిక్‌టాక్‌లో ఫేమస్. బాగా పాపులర్ అయిన ఆమెకు సినిమారంగంలో రావాలంటే చాలా ఇష్టమట. అందుకు తల్లిదండ్రులకు చెబితే గయ్యిమని లేచారట. చాలాసార్లు తిట్టారు కూడా. ఈ విషయమై ఆమె చెబుతూ, ఇంట్లో చాలా ఫైట్ జరిగింది. అందరూ సినిమా రంగంలోకి రావద్దన్నారు. ఒక్కోసారి ఫుడ్ కూడా పెట్టేవారు కాదు. అలాగే మొండిగా వుండేదాన్ని. స్టడీస్‌లో నేను ఫస్ట్. అలాగే సినిమానటిగా పేరు తెచ్చుకోవాలని వుందని చెప్పాను. చాలాసార్లు ఏడ్చాను.
ఇక లాభంలేదని.. పట్టుదలతో ఓ సినిమా సైన్ చేసి నాన్నగారికి చెప్పాను. దాంతో.. నీ ఇష్టం వచ్చింది చేయ్ అంటూ సీరియస్ గా అన్నారు. అలా మనుచరిత్ర అనే తెలుగు సినిమా చేశాను. ఇప్పుడు పెదకాపు 1 సినిమాలో నటించాను అని అన్నారు.
ఇక తెలుగులో ఏ హీరోస్ తో నాటించాలనుందని గురించి చెపుతూ, వరుణ్‌తేజ్ అని ఠక్కున చెప్పింది. ఎందుకంటే నాకు హైట్ వుండేవాళ్ళంటే ఇష్టమని చెప్పింది. ప్రభాస్, గ్లోబల్‌స్టార్ రామ్‌చరణ్ వీరితో కలిసి పనిచేయాలనుందని చెప్పింది. పెదకాపు1లో హీరో విరాట్ కర్ణ కూడా అరుఅడుగులపైనే వుంటాడు. ఫ్యూచర్లో తనకు కాబోయేవాడు కూడా హైట్‌గా వుండాలని రూల్ కూడా పెట్టనుంది.