ఆదిపురుష్ సినిమాలో తొలిసారి మర్యాద పురుషోత్తమ్మడైన శ్రీరామచంద్రుని పాత్రలో ప్రభాస్ నటిస్తున్నాడు. కెరీర్‌లో తొలిసారి పౌరాణిక పాత్రలో నటిస్తున్నాడు. మాములు సినిమాల్లోగా ఇందులో ఎలా పడితే.. అలా ఈ సినిమాలో నటిస్తానంటే కుదరదు. ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనన్ని రోజులు ప్రభాస్.. బ్రహ్మచర్యం పాటించాలి.
చాపపై పడుకోవాలి. కొన్ని నియమ నిష్ఠలు పాటించాలి. ఒప్పుడు ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి హీరోలు .. ఆ తర్వాత బాలకృష్ణ శ్రీరామరాజ్యం సినిమా కోసం చిరంజీవి... 'శ్రీమంజునాథ' సినిమా కోసం 'అన్నమయ్య' లో శ్రీవేంకటేశ్వర స్వామి వేషం వేసేటపుడు ఇలాంటి నియమ నిబంధలు పాటించారు.
ప్రభాస్ సరైన నియమ నిబంధనలు పాటించనందుకే ఈ సినిమా సెట్‌లో అగ్ని ప్రమాదం సంబవించిందని ప్రభాస్ సన్నిహిత వర్గాల కథనం. ముఖ్యంగా ముహూర్త బలం సరిగా లేనందనే ఇలాంటి ఘటన సంభవించిందని చెబుతున్నారు.
ముహూర్త బలం పుష్య బహుళ పంచమి రోజున ఎలాంటి ముహూర్తాలు లేవు. అలాంటి రోజున ఈ సినిమాను ప్రారంభోత్సవం చేసినందుకే ఈ సినిమాకు అనుకోని అవాంతరాలు ఏర్పడ్డాయని కొంత మంది పండితులు విశ్లేషిస్తున్నారు
అందుకే ఆదిపురుష్ సినిమా కోసం ప్రభాస్.. షూటింగ్ జరిగినన్ని రోజులు.. ఇలాంటి నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ప్రభాస్.. పెదనాన్న కృష్ణంరాజు సూచించినట్టు సమాచారం. దీంతో ప్రభాస్ కూడా 'ఆదిపురుష్' సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులు.. ఇదే నియమ నిష్ఠలతో ఉండాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.