Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏం ముహుర్తంలో మొదలెట్టాడో కానీ... 'కాటమరాయుడు'కు మళ్ళీ కష్టాలు

హీరో పవన్‌ కళ్యాణ్‌ సినిమా ఏ ముహూర్తంతో మొదలెట్టాడో... ఆ చిత్రం షూటింగ్‌ కొంచెం కొంచెం గ్యాప్‌తో సాగుతోంది. 'గబ్బర్‌ సింగ్‌' సినిమా విషయంలో ఇలా కొన్ని జర్క్‌లు పడ్డాయి. ఆ తర్వాత 'సర్దార్‌ గబ్బర్‌సింగ్

Advertiesment
Pawan Kalyan
, శుక్రవారం, 23 సెప్టెంబరు 2016 (19:32 IST)
హీరో పవన్‌ కళ్యాణ్‌ సినిమా ఏ ముహూర్తంతో మొదలెట్టాడో... ఆ చిత్రం షూటింగ్‌ కొంచెం కొంచెం గ్యాప్‌తో సాగుతోంది. 'గబ్బర్‌ సింగ్‌' సినిమా విషయంలో ఇలా కొన్ని జర్క్‌లు పడ్డాయి. ఆ తర్వాత 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'కు అది మరింత ఎక్కువైంది. రాజకీయ పార్టీ పనులు తోడుకావడంతో డేట్స్‌ విషయంలో తేడాలొచ్చాయి. స్వంత సినిమా కాబట్టి ఎటువంటి ఇబ్బందిలేకుండా సాగింది. 
 
డైరెక్టర్‌ మార్పుతో మొదలైన 'సర్ధార్‌' సినిమా రూపకల్పనలో హీరోయిన్‌, సినిమాటోగ్రాఫర్‌ వంటి అనేక మంది మార్పులు చేర్పులతో ఎట్టకేలకు విడుదలై, ప్రేక్షకుల చేత తిరస్కరింపబడింది. కాగా, ప్రస్తుతం కాటమరాయుడు సినిమాకు అదేవిధమైన బ్రేక్‌లు పడుతున్నాయి. మొన్ననే హైదరాబాద్‌లో ప్రారంభమైన షూటింగ్‌ ఆరంభించి రెండు రోజులవ్వగానే మూడోరోజు షెడ్యూల్‌ సాంకేతిక కారణాలవల్ల వాయిదా పడింది. 
 
ఈ షెడ్యూల్‌లో శ్రుతిహాసన్‌ కూడా రావాల్సివుంది. ఆమె ప్రస్తుతం విదేశాల్లో ఉండటంతో షెడ్యూల్‌ కాస్త ముందుకు జరిగే సూచనలు కన్పిస్తున్నాయి.   నిజానికి ఈ సినిమా కోసం సెప్టెంబర్‌ మొదటి వారంలో డేట్స్‌ ఇవ్వగా, పవన్‌ రాజకీయ సభల నేపథ్యంలో వాయిదా పడటంతో, ప్రస్తుతం డేట్స్‌‌ను మళ్ళీ క్రమబద్దీకరించే వరకు వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. 
 
ఈ సినిమాకు దర్శకుడు సంపత్‌ నంది ప్లేస్‌లో డాలీ వచ్చినట్లే... సినిమాటోగ్రాఫర్‌ సౌందర్‌ రాజన్‌ పక్కకు తప్పుకున్నాడని, సరైన సమయానికి పవన్‌ సినిమా ప్రారంభం కాకపోవడంతో, తప్పుకోవాల్సి రావడంతో, ఆయన స్థానంలో 'అత్తారింటికి దారేది' ఫేం ప్రసాద్‌ను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ముందుముందు ఎన్ని మార్పులు చోటు చేసుకుంటాయో చూడాలిమరి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అదృష్టవంతుడైన దర్శకుడు.. కొరటాలకు గిఫ్టు ఇచ్చేందుకు సిద్ధమైన జూనియర్ ఎన్టీఆర్