Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమీర్ ఓ ఇడియట్... తెగపని చేస్తాడు : విధు వినోద్ చోప్రా

బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ అమీర్‌ఖాన్.. లెజండ్రీ రెజ్ల‌ర్ మ‌హావీర్ పోగ‌ట్ జీవిత నేపథ్యంలో దంగల్ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. రెజ్లింగ్ నేప‌థ్యంలో త‌న ఇద్ద‌రు కూతుళ్ల క‌ల‌లు సాకారం చేయ‌డానిక

Advertiesment
అమీర్ ఓ ఇడియట్... తెగపని చేస్తాడు : విధు వినోద్ చోప్రా
, శనివారం, 22 అక్టోబరు 2016 (09:19 IST)
బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ అమీర్‌ఖాన్.. లెజండ్రీ రెజ్ల‌ర్ మ‌హావీర్ పోగ‌ట్ జీవిత నేపథ్యంలో దంగల్ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. రెజ్లింగ్ నేప‌థ్యంలో త‌న ఇద్ద‌రు కూతుళ్ల క‌ల‌లు సాకారం చేయ‌డానికి పోరాడే తండ్రి పాత్రలో అమీర్ నటించాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. 
 
పీకే సినిమా తర్వాత అమీర్ నటిస్తున్న చిత్రం కావడంతో... అభిమానులు ''దంగల్'' కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకే సినిమా రిలీజ్కు మరో రెండు నెలల సమయం ఉన్నా ముందుగానే ట్రైలర్ను రిలీజ్ చేశారు. దాదాపు సినిమా కథ అంతా ట్రైలర్లోనే రివీల్ చేశారు. తన దేశం కోసం బంగారు పతకం సాధించాలనుకున్న మహావీర్ అది సాధ్యం కాకపోవటంతో నిరుత్సాహపడతాడు.
 
తాను చేయలేనిది తన కొడుకు ద్వారా సాధించాలని నిర్ణయించుకున్నాడు. రెండు డిఫరెంట్ లుక్స్లో కనిపిస్తున్న అమీర్, ఆ లుక్స్ కోసం చాలా కష్టపడ్డాడు. వయసైన పాత్ర కోసం లావుగా తయారయ్యాడు. తర్వాత కుర్రాడిగా బరిలో దిగే రెజ్లర్ లుక్ కోసం భారీ కసరత్తులు చేసి కండలు తిరిగిన దేహంతో మరోసారి మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అని ప్రూవ్ చేసుకున్నాడు. 
 
ఇదిలావుంటే... అమీర్ వంటి ఇడియట్సే.. అంటే ఎక్కువ పనిచేసేవారు "దంగల్'' వంటి సినిమా చేయగలరని ''త్రీ ఇడియట్స్'' నిర్మాత విధు వినోద్ చోప్రా పొగడ్తల వర్షాన్ని కురిపించారు. ఇటీవల ముంబైలో జరిగిన మామి ఫిలిం ఫెస్టివల్‌కు హాజరైన ఆయన, "దంగల్''లో అమీర్ మల్లయోధుడిగా కనిపించిన తీరును ప్రశంసించారు. 
 
ఈ సందర్భంగా విధు వినోద్ చోప్రా మాట్లాడుతూ ఓ నటుడిగా అమీర్ అంటే తనకు చాలా ఇష్టమని అన్నారు. తనలోని నైపుణ్యాన్ని అమీర్ స్వతహాగా మరింత మెరుగు పర్చుకుంటున్నాడని అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అతగాడే రెజీనా ప్రియుడా... నెటిజన్లు ఏమంటున్నారు!