Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యువ హీరో సాహసం.. ఎయిట్ ప్యాక్స్ కోసం అలా చేశాడట...

Advertiesment
Naga Shaurya
, సోమవారం, 21 సెప్టెంబరు 2020 (14:59 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో యువ హీరోల హవా కొనసాగుతోంది. సరికొత్త కథలను ఎంచుకుని చిత్రాలు నిర్మించి హిట్ కొట్టడంలో పోటీపడుతున్నారు. అంతేకాకుండా, వివిధ రకాల ప్రయోగాలకు సైతం వారు ఏమాత్రం వెనుకాడటం లేదు. తాజాగా యువ హీరో నాగశౌర్య కూడా ఓ సాహసం చేశారు. ఎయిట్ ప్యాక్ కోసం ఏకంగా ఐదు రోజుల పాటు చుక్క మంచినీరు కూడా ముట్టుకోలేదట. 
 
సంతోష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. వర్కింగ్‌ టైటిల్‌ ఎన్‌ఎస్‌20. స్పోర్ట్స్‌ డ్రామాగా రానుండగా.. ఇందులో విలుకాడిగా శౌర్య కనిపించనున్నాడు. ఈ పాత్రలో ఎయిట్ ప్యాక్ (ఎనిమిది పలకల) బాడీ షేప్‌తో కనిపిస్తాడు. ఇందుకోసం ఎన్నో వర్కౌట్స్ చేస్తూ.. స్ట్రిక్ట్ డైట్ అనుసరిస్తున్నాడు. లాక్డౌన్‌ రోజుల్లో కూడా అతను తన డైట్‌ని క్రమం తప్పకుండా పాటించాడు. జిమ్‌లో సైతం ప్రతి రోజూ చెమటోడ్చాడు.
webdunia
 
ఈ క్రమంలో ఈ చిత్రం షూటింగ్ ఇటీవల మళ్లీ ప్రారంభమైంది. కీలక సన్నివేశాల చిత్రీకరణ హైదరాబాద్‌లో సాగుతోంది. ఈ సన్నివేశాలకు నాగశౌర్య తన ఎయిట్‌ ప్యాక్‌ బాడీని ప్రదర్శించాల్సి ఉంది. ఫిట్ బాడీని మెయింటైన్ చేయడం అంత తేలిక కాదు. శౌర్య నీటిని తాగడం ఆపివేశాడట. ఐదు రోజులుగా లాలాజలం కూడా మింగడం లేదు. ఇది నమ్మశక్యంగా లేదు కానీ నిజం. 
 
ఇది సినిమా పట్ల ఆయనకున్న అభిరుచిని తెలియజేస్తుందని చిత్రబృందం అంటున్నది. చిత్రంలో కేతికాశర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నారాయణ దాస్‌ నారంగ్‌, శరత్‌ మరార్‌, పి. రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రభాస్ మూవీకి దిగ్గజ దర్శకుడి క్రియేటివ్ గైడెన్స్...