తెలంగాణ రాజకీయ వర్గాల్లో మంత్రి మల్లారెడ్డికి ప్రత్యేక స్థానం ఉంది. సీరియస్ రాజకీయాల్లో తనదైన శైలిలో మాట్లాడి నవ్వించే వ్యక్తి. పంచ్ డైలాగులతో ప్రజలనే కాదు రాజకీయ నాయకులను కూడా ఆకట్టుకుంటున్నారు మల్లా రెడ్డి.
"నేను పాలు అమ్ముకున్నాను, పువ్వులు అమ్మాను, బోరు బావి వేసాను, కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నాను.." అంటూ ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
తాజా సమాచారం ఏంటంటే.. మంత్రి మల్లా రెడ్డి సినిమా రంగ ప్రవేశం చేయబోతున్నారు. ఏడాదిలోపు నాలుగు సినిమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ నాలుగు సినిమాలు తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లో ఉంటాయని అంటున్నారు. దీనికి సంబంధించి అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.
తెలుగు చలనచిత్ర సమాఖ్య ఆధ్వర్యంలో మేడే వేడుకలు జరిగిన సమయంలోనే మల్లా రెడ్డి సినీ రంగ ప్రవేశం గురించి మాట్లాడారు. ఇప్పుడు ఓటీటీకి ఆదరణ పెరిగిందన్నారు. ఓటీటీ కంపెనీని కూడా ప్రారంభించి సినిమాలు తీయనున్నారు.
తొలి సినిమా మెగాస్టార్ చిరంజీవితో చేస్తానని చెప్పారు. అప్పుడొకసారి పవన్ కళ్యాణ్ సినిమాలో తనకు విలన్ రోల్ ఆఫర్ వచ్చిందని కూడా వెల్లడించిన సంగతి తెలిసిందే.