Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Uday Kiran: దిల్ రాజు సోదరుడే క్షమాపణ చెప్పారు.. మెగా ఫ్యామిలీకి ఉదయ్ కిరణ్ ఓ లెక్కా? (Video)

Advertiesment
Uday Kiran

సెల్వి

, గురువారం, 3 జులై 2025 (10:29 IST)
Uday Kiran
గేమ్ ఛేంజర్ మూవీ రిజల్ట్‌పై దిల్ రాజు సోదరుడు, నిర్మాత శిరీష్ రెడ్డి స్పందించారు. నితిన్ హీరోగా నటించిన తమ్ముడు సినిమా ప్రమోషన్లలో భాగంగా మాట్లాడిన ఆయన గేమ్ ఛేంజర్‌ సినిమా తర్వాత రామ్ చరణ్‌ కానీ, డైరెక్టర్ శంకర్‌ కానీ కనీసం తమకు ఫోన్ కూడా చేయలేదన్నారు. అయితే ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో నిర్మాత శిరీష్ రెడ్డి మెగా కుటుంబంతో తమకు ఎలాంటి వివాదం లేదన్నారు. గేమ్ చేంజర్ సినిమా కోసం మాకు రామ్ చరణ్ తన పూర్తి సమయం, సహకారం అందించారని శిరీష్ రెడ్డి అన్నారు. 
 
గేమ్ చేంజెర్ రిలీజ్ టైమ్ లో సంక్రాంతికి వస్తున్నాం సినిమాని రిలీజ్ చెయ్యమని సలహా ఇచ్చిందే రామ్ చరణ్ శిరీష్ రెడ్డి తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి గారి కుటుంబానికి మెగా హీరోలకు మాకు ఎన్నో ఏళ్ళ నుండి సాన్నిహిత్యం ఉంది, తన మాటలు ఎవరి మనోభావాలను అయినా ఇబ్బంది పెడితే క్షమించండి, త్వరలోనే రామ్ చరణ్ తో ఓ సినిమా చేయబోతున్నాం అని శిరీష్ రెడ్డి చెప్పుకొచ్చారు. 
 
అయితే శిరీష్ రెడ్డిని ఇబ్బంది పెట్టడంతోనే వీడియో ద్వారా అంత పెద్ద నిర్మాత క్షమాపణలు చెప్పారని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. మెగా నిర్మాతలకే మెగా ఫ్యామిలీ ముప్పు తిప్పలు పెడుతుంటే.. తన టాలెంట్‌తో పైకొచ్చి.. యంగ్ హీరోగా అదరగొట్టి.. ఆపై ఆత్మహత్యకు పాల్పడిన హీరో ఉదయ్ కిరణ్ ఎంత మాత్రం అంటూ వీడియోస్ విడుదల చేస్తూ నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బతకాల్సిన వయస్సులో ఉదయ్ కిరణ్ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడంపై ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో ఉదయ్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చునని చెప్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్టోరీ, స్క్రీన్‌ప్లే సరికొత్తగా కౌలాస్ కోట చిత్రం రూపొందుతోంది