Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నీకు లైఫ్‌ ఇస్తున్నాం కదా.. మాకేమిస్తావ్, సాయంత్రం ఫ్రీనా అని నిర్మాతలు అడుగుతారు: మాధవీలత

మాధవీలత. టాలీవుడ్ హీరోయిన్. "నచ్చావులే" చిత్రం ద్వారా వెండితర అంరంగేట్రం చేసింది. ఈ చిత్రంలో తన నటనతో ప్రతి ఒక్కరికీ నచ్చినప్పటికీ... ఆ తర్వాత చెప్పుకోదగిన అవకాశాలు రాలేదు. దీంతో ఆమె వెండితెరకు దూరమైం

Advertiesment
నీకు లైఫ్‌ ఇస్తున్నాం కదా.. మాకేమిస్తావ్, సాయంత్రం ఫ్రీనా అని నిర్మాతలు అడుగుతారు: మాధవీలత
, మంగళవారం, 7 మార్చి 2017 (12:01 IST)
మాధవీలత. టాలీవుడ్ హీరోయిన్. "నచ్చావులే" చిత్రం ద్వారా వెండితర అంరంగేట్రం చేసింది. ఈ చిత్రంలో తన నటనతో ప్రతి ఒక్కరికీ నచ్చినప్పటికీ... ఆ తర్వాత చెప్పుకోదగిన అవకాశాలు రాలేదు. దీంతో ఆమె వెండితెరకు దూరమైంది. అయితే, గత కొంతకాలంగా మీడియాకు కూడా దూరంగా ఉన్న ఆమె.. ఇపుడు ఉన్నట్టుండి మీడియా ముందుకు వచ్చి కొన్ని సంచలన విషయాలు వెల్లడించింది. 
 
తెలుగు చిత్రపరిశ్రమలో తెరవెనుక జరుగుతున్న కొన్ని సంచలన విషయాలను ఆమె బహిర్గతం చేసింది. ముఖ్యంగా, పలువురు నిర్మాతలు హీరోయిన్లతో ఏవిధంగా వ్యవహరిస్తారో వెల్లడించింది. 'నీకు లైఫ్‌ ఇస్తున్నాం కదా.. మరి, నువ్వు మాకేమిస్తావ్‌ అనే ధోరణిలో ఉంటాయి నిర్మాతల వ్యాఖ్యలు. అంతేకాదు చాలా సున్నితంగా నువ్వు సాయంత్రం ఖాళీయేనా అని అడుగుతారు. బయట ఎవరైనా ఇలా మాట్లాడితే చెప్పు తీసుకుని కొట్టాలనిపిస్తుంది. కానీ, ఇక్కడే బతకాలి కదా! అందుకే చాలా మంది నోర్మూసుకుని ఆ వేధింపులను భరిస్తుంటారన'ని చెప్పుకొచ్చింది. 
 
ఇటీవలికాలంలో ఈ తరహా వ్యాఖ్యలు పలువురు నటీమణుల నోటి నుంచి జాలువారుతున్నాయి. మరికొందరు స్టార్ హీరోయిన్లు మాత్రం తమ కెరీర్‌ దృష్ట్యా ఈ తరహా విషయాలను బయటకు పొక్కనీయకుండా మిన్నకుండిపోతుంటారు. కానీ, అవకాశాలు లేని, ఇండస్ట్రీలో మోసపోయిన నటీమణులు మాత్రం ఈ తరహా ఆరోపణలు చేస్తున్నారనే కామెంట్స్ లేకపోలేదు. 

ఇండస్ట్రీలో ఎవరికీ లొంగకపోవడం వల్లే తనకు ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ఒక ప్రొడ్యూసర్‌ అడిగిన దానికి ఆమె నో చెప్పినందుకు తనను ఎలా వేధించాడో వివరించింది. లొకేషన్‌లో అందరిముందు అరిచేవాడని, ఒకసారి సాంగ్ షూటింగ్ కోసం షార్ట్ డ్రెస్ వేసుకోమంటే వేసుకోకపోవడంతో పెద్ద గొడవ జరిగిందని చెప్పింది. ఇండస్ట్రీలో పెద్ద మనుషులుగా చలామణీ అవుతున్న చాలమంది.. హీరోయిన్స్ విషయంలో మాత్రం సెక్సువల్ రిలేషన్‌కే ప్రాధాన్యత ఇస్తారని తెలిపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బన్నీ సరసన ధోనీ హీరోయిన్.. వంశీ డైరక్షన్.. "నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా"